నాకు ఆ స్థాయి లేదు: అభిమాని కాళ్లు మొక్కిన మెగా హీరో!
మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ అభిమానుల కాళ్లు మొక్కుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన తాజా సినిమా 'ఇంటిలిజెంట్' ప్రమోషనల్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా అయితే అభిమానులు హీరో కాళ్లు మొక్కడం చూశాం, కానీ ఇక్కడ సీన్ రివర్స్ కావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఏం జరిగింది?
‘ఇంటిలిజెంట్' ప్రమోషనల్ ఈవెంటులో సాయిధరమ్ తేజ్ పాల్గొనగా..... అక్కడ ఆయన్ను కలిసేందుకు కొందరు అభిమానులు వచ్చారు. వారు తమ అభిమానాన్ని చాటుకోవడానికి సాయి ధరమ్ తేజ్ కాళ్లుమొక్కారు. దీంతో వెంటనే రియాక్ట్ అయిన మెగా హీరో తిరిగి వారి కాళ్లను మొక్కాడు.
Recommended Video


నాకు ఆ స్థాయి లేదు
కాళ్లు మొక్కించుకునే స్థాయి తనకు లేదని, తాను ఇంకా ఆ స్థాయికి రాలేదని, దయచేసి అభిమానులు ఎవరూ అలా చేయవద్దని సాయి ధరమ్ ఈ సందర్భంగా వారికి సూచించారు.

హీరో సూర్య కూడా
హీరో సూర్య కూడా ఇటీవల తన సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ వేడుకలో పాల్గొనగా అభిమానులు ఇలానే చేశారు. అపుడు సూర్య కూడా వెంటనే తిరిగి వారి కాళ్లకు మొక్కిన సంగతి తెలిసిందే. ఇపుడు సాయి ధరమ్ తేజ్ కూడా అదే ఫాలో అయ్యాడు.

ఇంటిలిజెంట్
సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ఇంటిలిజెంట్ చిత్రంలో నటిస్తున్నారు. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదలవుతుంది.

నటీనటులు
సాయిధరమ్‌తేజ్, లావణ్య త్రిపాఠి, నాజర్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్, ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్, దేవ్‌గిల్, వినీత్‌కుమార్, జె.పి. ప థ్వీ, రుబాబు, కాదంబరి కిరణ్, విద్యుల్లేఖా రామన్, సప్తగిరి, తాగుబోతు రమేష్, భద్రం, నల్ల వేణు, రాహుల్ రామకృష్ణ, వెంకీ మంకీ, రాజేశ్వరి నాయర్, సంధ్యా జనక్, ఫిష్ వెంకట్, శ్రీహర్ష, శివమ్ మల్హోత్రా, రవిరామ్ తేజ, తేజారెడ్డి నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: ఎస్.వి. విశ్వేశ్వర్, సంగీతం: థమన్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఫైట్స్: వెంకట్, డాన్స్: శేఖర్, జాని, సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా, నిర్మాత: సి.కళ్యాణ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.


Click it and Unblock the Notifications











