మెగాస్టార్ చిరంజీవి లుక్‌లో మేనల్లుడు (ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ త్వరలో 'రేయ్' చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో 'రేయ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నారు. ఈచిత్రంలో ఆయన మామయ్య మెగాస్టార్ చిరంజీవి పోలి ఉంటాడని తెలుస్తోంది. ఆయన ఫోటోలు కూడా చిరంజీవి పాత సినిమాల్లోని లుక్‌ను గుర్తు చేస్తోంది.

సాయి ధరమ్ తేజ్ 'రేయ్' చిత్రం విడుదల కాకముందే ఆయన్ను వరుస అవకాశాలు వరిస్తున్నాయి. మెగాస్టార్ ఫ్యామిలీకి చెందిన వాడు కావడంతో అతని కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. నటనలో, డ్యాన్సుల్లో చిరంజీవి గుర్తు చేస్తుండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

'రేయ్' చిత్రం తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన 'ఓ పిల్లా నువ్వేలేని జీవితం' చిత్రం విడుదల కానుంది. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను బన్నీ వాసు, హర్షిత్ నిర్మిస్తున్నారు. దీంతో వాసువర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న 'లవర్' అనే చిత్రంలోనూ సాయి ధరమ్ తేజ్ నటించబోతున్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక రేయ్ సినిమా వివరాల్లోకి వెళితే...డిసెంబర్ 8న ఈచిత్రం ఆడియో విడుదల చేసేందుక సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరైన సీడీలను ఆవిష్కరించనున్నట్లు సమాచారం. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ చిత్రం గురించి వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ 'ఇటీవలి కాలంలో యూత్‌ని టార్గెట్ చేస్తూ క్లాస్, ఫాస్ట్‌ఫుడ్ తరహా లవ్‌స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే 'దేవదాసు', 'దేశముదురు' తరహాలో భారీ స్థాయి మాస్, యూత్ లవ్‌స్టోరీలు రావడంలేదు. ఆ లోటుని తీర్చేవిధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో 'రేయ్' తయారవుతోంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుందని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X