చ.. చ... చ చంపేశావ్ తారక్ అంటూ మెగా హీరో ట్వీట్
ఎన్టీఆర్ జై లవ కుశ ట్రైలర్‌పై సాయి ధరమ్ తేజ్ స్పందించాడు. ట్రైలర్ చాలా బావుందని, తారక్ సూపర్బ్ అంటూ ట్వీట్ చేశారు.
Recommended Video

'జై లవ కుశ' ట్రైలర్ గురువారం సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ ట్రైలర్‌కు 20 గంటల్లోనే 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ఈ ట్రైలర్ చూసిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ "చ .. చ .. చ .. చంపేశావ్ తారక్ " అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో జై పాత్రకు కాస్త నత్తి ఉంటుంది. అందుకే సాయి ధరమ్ తేజ్ ఇలా ట్వీట్ చేసినట్లు సమాచారం.
సాయి ధరమ్ తేజ్ ట్వీట్
జై లవ కుశ ట్రైలర్ పై సాయి ధరమ్ తేజ్ ట్వీట్. ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అందుకే తారక్ సినిమాకు ఇలా ప్రమోట్ చేస్తున్నాడు.
జై లవ కుశ
ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'జై లవ కుశ' ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమాపై ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. సినిమా పేరు 'జై లవ కుశ' అయినా... సినిమాలో ఎన్టీఆర్ పోషించిన మూడు పాత్రలు రావణ..రామ లక్ష్మణుల్లా ఉండబోతున్నాయి. ఏ తల్లికైనా ముగ్గురు మగ పిల్లలు పుడితే రామ లక్ష్మణ భరతులు అవ్వాలని కోరుకుంటుంది. కానీ దురదృష్ట వశాత్తు ఈ తల్లికి పుట్టిన బిడ్డలు రావణ... రామ లక్ష్మణులయ్యారు అంటూ 'జై లవ కుశ' ట్రైలర్ మొదలైంది.

రక్తం ధారపోసి మీ అందరితో ఇలాగే ఉండిపోతా... ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
జై లవ కుశ' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఆదివారం శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ ఎమోషనల్ గా మాట్లాడారు.

ప్రణతి భయపడింది, తారక్ తప్ప ఎవరూ చేయలేరు: కళ్యాణ్ రామ్
'జై లవ కుశ' ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా గురించి, సినిమా కోసం తన తమ్ముడు తారక్ పడ్డ కష్టం గురించి చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











