Virupaksha: సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మృతి.. గౌరవార్థంగా విడుదల వాయిదా

మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మరో హీరో సాయి ధరమ్ తేజ్. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రేయ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఈ హీరో. అనంతరం విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో ఎక్కువగా ఫ్లాప్స్ నే చవిచూశాడు.

ప్రస్తుతం వినోదయ సీతం రీమెక్ మూవీలో నటిస్తున్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.. విరూపాక్ష అనే మరో చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ రావాల్సిన అప్డేట్ ను మేకర్స్ తాజాగా వాయిదా వేశారు. అది ఎందుకనే వివరాల్లోకి వెళితే..

చాలా సినిమాలు..

చాలా సినిమాలు..

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు సాయి ధరమ్ తేజ్. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా పలు విభాగాల్లో అదరగొట్టి సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. పిల్ల నువ్వు లేని జీవితం, రేయ్, సుబ్రమణ్యం ఫర్ సేల్, తిక్క, సుప్రీమ్, నక్షత్రం, జవాన్, ఇంటలిజెంట్, విన్నర్, ప్రతి రోజు పండగే, చిత్ర లహరి, సోలో బతుకే సో బెటర్, రిపబ్లిక్ చిత్రాలతో అలరించాడు. అయితే వీటిలో కొన్ని మాత్రమే హిట్ కాగా దాదాపు చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.

15వ చిత్రంగా..

15వ చిత్రంగా..

రిపబ్లిక్ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ కు జరిగిన యాక్సిడెంట్ కారణంగా కొత్త సినిమా కాస్తా ఆలస్యం అయింది. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో కొత్త సినిమాలతో ముందుకు రానున్నాడు ఈ హీరో. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ 15వ చిత్రంగా వస్తున్న మూవీ విరూపాక్ష్. ఈ సినిమాతో కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విభిన్నమైన కథతో రూపొందుతోంది. ఇదివరకు విడుదలైన మూవీ గ్లింప్స్ ఎంతో ఆకట్టుకున్నాయి.

అసలు నిజాన్ని చూపించే..

అసలు నిజాన్ని చూపించే..

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న 'విరూపాక్ష' సినిమా టైటిల్ గ్లింప్స్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. గంభీరమైన స్వరంతో అతడు 'అజ్ఞానం భయానికి మూలం. భయం మూఢ నమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనప్పుడు.. ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు.. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం' అంటూ పలికిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. సార్, భీమ్లా నాయక్ బ్యూటి సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రెసిడెంట్ మృతితో..

ప్రెసిడెంట్ మృతితో..

సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు నిర్మిస్తున్న సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా టీజర్ ను ఇవాళ అంటే మార్చి 1న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే దీన్ని వాయిదా వేసినట్లు తాజాగా మేకర్స్ వెల్లడించారు. మెగా అభిమాని, సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రావూరి పండు మరణించారు. భీమవరానికి చెందిన రావూరి పండు మృతికి సంతాపంగా, నివాళులు అర్పిస్తూ విరూపాక్ష టీజర్ విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

పవన్ కల్యాణ్ అభినందనలు..

పవన్ కల్యాణ్ అభినందనలు..

అయితే ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చూసేసిన ఈ టీజర్ చాలా బాగుందని మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తోపాటు మూవీ యూనిట్ ను అభినందించారు. ఈ టీజర్ రిలీజ్ డేట్ ను మరోసారి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పాన్ ఇండియాగా రూపొందుతోన్న విరూపాక్ష సినిమాను తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏప్రిల్ 21న విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్రానికి కథ, కథనం సుకుమార్ అందించగా.. కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X