twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sai Dharam Tej Accident ట్రాఫిక్ ఫైన్ కట్టిన గుర్తుతెలియని వ్యక్తి.. కూపీ లాగుతున్న పోలీసులు!

    |

    టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కేసులో నివ్వెరపోయే నిజాలు బయటపడుతున్నాయి. అయితే మితి మీరిన వేగం వల్లే ప్రమాదం జరిగిందనే విషయాన్ని ప్రాథమికంగా తెలంగాణ రాష్ట్ర ట్రాఫిక్ పోలీసు విభాగం ధృవీకరించింది. అయితే రోడ్డుపై ఇసుక కారణంగానే ప్రమాదం జరిగింది. రోడ్ల విషయంలో ప్రభుత్వం పనితీరు బాగాలేదనే విమర్శలు వస్తున్న నేపత్యంలో తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతను నిర్వహిస్తున్న దిలీప్ కొణతం ఆశ్చర్యకరమైన విషయాలను తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. అయితే దిలీప్ కొణతం తన ఫేస్‌బుక్ పోస్టులో ఏం చెప్పారంటే..

    ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి

    ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి

    సాయిధరమ్ తేజ్‌ ప్రమాదానికి గురైన ప్రాంతంలో పరిమిత వేగంతో ప్రయాణించాలనే నిబంధన ఉంది. ఆ నిబంధనను సాయిధరమ్ తేజ్ ఉల్లంఘించారునే విషయాన్ని ప్రస్తావించారు. కేబుల్ బ్రిడ్జిపై అనుమతించిన వేగం గంటకు 40 కిలోమీటర్లు, అలాగే ప్రమాదం జరిగిన ప్రదేశంలో గంటకు 30 కిలో మీటర్లు మాత్రమే ప్రయాణించాలి అని దిలీప్ కొణతం తన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.

    కేబుల్ బ్రిడ్జీపై మితి మీరిన వేగంతో

    కేబుల్ బ్రిడ్జీపై మితి మీరిన వేగంతో

    అయితే నిబంధనలకు విరుద్ధంగా సాయిధరమ్ తేజ్ ప్రమాదం సమయంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో, అలాగే కేబుల్ బ్రిడ్జిపై గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడనే విషయం ట్రాఫిక్ పోలీసుల సీసీటీవీ ఫుటేజ్ తనిఖీలో వెల్లడైంది. అదే విషయాన్ని దిలీప్ కొణతం తన పోస్టులో స్పష్టం చేశారు. దాంతో సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ వ్యవహారంలో మరో వివాదం తెరపైకి వచ్చింది.

    సెకండ్ హ్యాండ్ బైక్ అంటూ

    సెకండ్ హ్యాండ్ బైక్ అంటూ

    అయితే సాయిధరమ్ తేజ్ వాడిన ట్రింప్ ట్రైడెంట్ 660 బైక్ బ్రాండ్ న్యూ కాదనే విషయం బయటకు వచ్చింది. సాయిధరమ్ ఉయోగించిన బైక్ హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌కు చెందిన బూర అనిల్ కుమార్‌‌ పేరుపై నమోదై ఉంది. కొన్నేళ్ల క్రితం ఆ బైక్‌ను అనిల్ నుంచి సాయిధరమ్ తేజ్ కొనుగోలు చేశాడని, అయితే తన పేరుకు మార్పించుకొలేదనే విషయాన్ని దిలీప్ కొణతం తన పోస్టులో వెల్లడించారు.

    ట్రాఫిక్ చలానాను చెల్లించిన గుర్తు తెలియని వ్యక్తి

    ట్రాఫిక్ చలానాను చెల్లించిన గుర్తు తెలియని వ్యక్తి

    సాయిధరమ్ ఉయోగించిన ట్రింప్ ట్రైడెంట్ 660 బైక్‌‌పై తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయం చలానా కూడా విధించింది. మితి మీరిన వేగంతో ప్రయాణించారనే కారణంతో రూ.1135 రూపాయల చలానా విధించారు. అయితే గతేడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న చలానాను ప్రమాదం జరిగిన వెంటనే గుర్తు తెలియని వ్యక్తులు చెల్లించారు. అయితే పెండింగ్ చలానా ఫీజును ఎవరు చెల్లించారనే విషయం ఇప్పడు పోలీసు వర్గాల్లోను, అలాగే మీడియాలోను చర్చనీయాంశమైంది.

    ట్రాఫిక్ ఫైన్‌ను చెల్లించినది ఎవరు?

    ట్రాఫిక్ ఫైన్‌ను చెల్లించినది ఎవరు?

    సాయిధరమ్ తేజ్ వాడుతున్న బైక్‌పై ఉన్న చలానాను ఎవరు చెల్లించారు? ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తి ఆచూకీ లభ్యమైతే ఎవరు, ఎందుకు కట్టారనే విషయంపై కూపీ లాగే అవకాశం ఉంది. ఇప్పటికే సాయిధరమ్ తేజ్‌పై మితిమీరిన వేగంతో వాహనం నడిపారనే అభియోగంపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

    దిలీప్ కొణతం ఎవరంటే?

    ఇక సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ నేపథ్యంలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేసేందుకు పోస్టు పెట్టిన దిలీప్ కొణతం తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవిని నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా వింగ్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం దిలీప్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ అంశంపై భారీ చర్చ జరుగుతున్నది.

    English summary
    Actor Sai Dharam Tej's rash Driving become as debate in social circles. Telangana State digital media diector Dileep Konatam made some interesting allegations on accident which goes viral in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X