షాకింగ్.. చిరంజీవి ఫ్లాప్ సినిమా రీమేక్ అట.. సాయిధరమ్ చెబితే మెగాస్టార్ ఏమన్నారంటే..

By Rajababu

మెగా ఫ్యామిలీ నుంచి దూసుకొచ్చిన సుప్రీంస్టార్ సాయిధరమ్ తేజ్ వరుస చిత్రాలతో సత్తా చాటుతున్నాడు. సక్సెస్‌లు, ఫ్లాపులకు అతీతంగా ప్రేక్షకులకు చేరువవుతున్న ఈ మెగా మేనల్లుడు ఛాన్స్ దొరికితే మెగాస్టార్ చిరంజీవి పాటలను రీమిక్స్ చేసి అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు పాటలకే పరిమితమైన సాయిధరమ్ తేజ్.. అవకాశం లభిస్తే చిరంజీవి నటించిన ఓ చిత్రాన్ని రీమేక్ చేస్తాననే మాటను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ఆ సినిమా ఏమింటంటే..

 వైవిధ్యమైన చిత్రాలతో చిరు

వైవిధ్యమైన చిత్రాలతో చిరు

గతంలో చిరంజీవి వరుస హిట్లతో దుమ్మురేపుతూనే వైవిధ్యమైన చిత్రాల్లోనూ నటించారు. తన నటన ప్రతిభను బయటపెట్టుకోవడానికి శుభలేఖ, రుద్రవీణ, స్వయంకృషి, చంటబ్బాయ్ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు.

చార్లీచాప్లిన్‌గా చిరంజీవి

చార్లీచాప్లిన్‌గా చిరంజీవి

అదే సమయంలో తనకిష్టమైన నటుడు చార్లీచాప్లిన్‌ స్పూర్తిగా ప్రముఖ దర్శకుడు జంధ్యాలతో కలిసి చంటబ్బాయ్ అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పూర్తి కామెడీ ప్రధానమైన చిత్రంగా రూపొందింది. ఈ చిత్రంలో ప్రైవేట్ డిటెక్టివ్‌గా నటించిన చిరంజీవి చార్లిచాప్లిన్‌ వేషంలో కనిపించారు.

చంటబ్బాయ్ అంటే ఇష్టం

చంటబ్బాయ్ అంటే ఇష్టం

అయితే చంటబ్బాయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించకపోయినా చిరంజీవి విమర్శకులను మెప్పించారు. ఆ చిత్రమంటే సాయిధరమ్ తేజ్ చాలా ఇష్టమట. ఆ సినిమాను రీమేక్ చేసే అవకాశం ఎప్పుడొస్తుందో అని వేచి చూస్తున్నాను.

 మొబైల్ ఫోన్‌లో

మొబైల్ ఫోన్‌లో

చంటబ్బాయ్ సినిమా నా మొబైల్ ఫోన్‌లో ఎప్పడూ ఉంటుంది. నా మూడ్ బాగాలేకపోయినప్పుడు గానీ, ఖాళీగా ఉన్న సమయంలో గానీ చంటబ్బాయ్ సినిమాను చూస్తానని సాయిధరమ్ తేజ్ చెప్పాడు. ఆ చిత్రం చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చిరంజీవి చేసిన కామెడీ తనకు ఎంతో ఇష్టమని సాయిధరమ్ తేజ్ చెప్పాడు.

ఆ సీన్ చూసి నవ్వుకుంటాను

ఆ సీన్ చూసి నవ్వుకుంటాను

చంటబ్బాయ్ చిత్రంలో వెల్‌కమ్ మిస్టర్ జ్వాలా.. ఐ వాంట్ యూ ఇంటారాగేట్ యూ అనే డైలాగ్ అద్భుతంగా ఉంటుంది. ఆ సీన్ చూస్తే అన్ని బాధలు దూరమవుతాయి. చంటబ్బాయ్ సినిమా రీమేక్ చేస్తాను అని చిరంజీవితో అంటే నవ్వుకొన్నారు.

 లేవగానే చిరంజీవి ఫొటో

లేవగానే చిరంజీవి ఫొటో

అంతేకాకుండా చిరంజీవి గురించి సాయిధరమ్ తేజ్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. ఉదయం లేవగానే మొదట చిరంజీవి ఫొటోను చూస్తాడట. విదేశాల్లోకి వెళ్లినప్పుడు కూడా చిరంజీవి ఫొటోను పట్టుకెళ్తాడట. ఒకవేళ ఫొటో పట్టుకెళ్లడం వీలు కాకపోతే మొబైల్ ఫోన్‌లో చూస్తాను అని సాయిధరమ్ తేజ్ వెల్లడించాడు.

పవన్ ఆ సినిమాలంటే ఇష్టం

పవన్ ఆ సినిమాలంటే ఇష్టం

పవన్ కల్యాణ్ నటించిన సుస్వాగతం చిత్రంలో తండ్రి చనిపోయిన సన్నివేశంలో ఆయన నటన అద్భుతంగా ఉంటుంది. అలాగే అన్నవరం చిత్రంలో వేణు చనిపోయిన సీన్ పవర్‌స్టార్ నటన సూపర్‌గా ఉంటుంది.

 ఆ ముగ్గురికి రుణపడి

ఆ ముగ్గురికి రుణపడి

మెగా ఫ్యామిలీ నుంచి రావడం వల్ల నా గురించి ఏవోవో రాస్తుంటారు. నేను పట్టించుకోను. కానీ నాకు మా మామయ్యలకు ఎంతో రుణపడి ఉన్నానో నాకు తెలుసు. నేను వారిని ఎంతగా ప్రేమిస్తానో నాకు తెలుసు. చెర్రీ, బన్నీ, వరుణ్‌ను ఎంతగా ప్రేమిస్తానో నాకు తెలుసు. ప్రతీసారి నాకు నేను రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. సినిమా ఫంక్షన్లో మాట్లాడకపోతే కొంత భజన అంటారు. మాట్లాడకపోతే బలుపు అనుకొంటాను.

రేయ్ సినిమా ఆగిపోవడానికి

రేయ్ సినిమా ఆగిపోవడానికి

రేయ్ సినిమా ఆగిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ విషయంలో ఎవరినీ తప్పు పట్టకూడదు. పవన్, చిరంజీవి సపోర్ట్ ఉన్నప్పటికీ.. ఆర్థిక సమస్యలు వెంటాడాయి. సినిమా లేటు కావడంతో కథ కూడా అవుట్‌డేట్ అయింది.

అన్ లక్కీ ఫెలోగా బ్రాండ్

అన్ లక్కీ ఫెలోగా బ్రాండ్

రేయ్ సినిమా ఆగిపోవడంతో నాకు అన్ లక్కీ ఫెలో అని బ్రాండ్ వేశారు. మా సినిమా షూట్ ముగిసే సమయంలో శ్రీహరి గారు చనిపోయారు. అప్పుడు మళ్లీ సినిమా అంతా రీషూట్ చేశాం. సాధారణంగా హీరోయిన్లకు ఐరెన్ లెగ్ అంటారు. కానీ నాకు ఆ పేరు వచ్చింది.

మెగా బ్రదర్స్ ఆశీస్సులతో

మెగా బ్రదర్స్ ఆశీస్సులతో

టాలీవుడ్‌లో చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు బ్రాండ్ ఉంది. దానిని పెద్దగా వాడుకోలేదు. చిరంజీవి, పవన్ ఆశీస్సులతో నేను నిలదొక్కుకున్నాను. నేనెవరో తెలియకుండానే నాకు మొదటి సినిమా అవకాశాన్ని వైవీఎస్ చౌదరీ ఇచ్చాడు. నేనెప్పుడు మెగా ఫ్యామిలీ పేరును పెద్దగా ఉపయోగించుకోలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X