ప్యారిస్‌లో ఆ హీరొయిన్‌తో సాయిధరమ్ తేజ్ రొమాన్స్
మెగా హీరో సాయిధరమ్ తేజ్, అందాల తార అనుపమ పరమేశ్వరన్ జంటగా ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు ఓ ప్రేమ కథను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు కరుణాకరన్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఇటీవల తేజ్.. ఐలవ్ యూ అని టైటిల్ ఖారారు చేశారు. ఈ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన తేజ్ ఫస్ట్ ఫీల్‌కు సోషల్ మీడియాలో అనూహ్యమైన స్పందన వస్తున్నది.
తేజ్ ఐ లవ్ యూ అనే చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఈ చిత్రంలోని ఓ పాటను ప్రస్తుతం ప్యారిస్‌లో తెరకెక్కిస్తున్నారు. జూన్ మూడో వారంలో గానీ, జూలై మొదటివారంలో గానీ ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

More from Filmibeat
tej i love you sai dharam tej anupama parameshwaran ks rama rao తేజ్ ఐ లవ్ యూ సాయిధరమ్ తేజ్ అనుపమ పరమేశ్వరన్ కేఎస్ రామారావు


Click it and Unblock the Notifications











