చిరు మేనల్లుడి 2వ మూవీకి మూహూర్తం ఖరారు
ఈ విషయాలను తాజాగా అఫీషియల్ గా ప్రకటించారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. పూర్తి వివరాలు సినిమా ప్రారంభోత్సవం రోజున ప్రకటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రారంభోత్సవ ఏర్పాట్లు మొదలు పెట్టారు. సినిమా ప్రారంభాన్ని చాలా గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో 'రేయ్' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రానికి చక్రి సంగీతం అందిస్తుండగా, గుణశేఖరన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. 2013లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సినిమాపై అంచనాలు పెంచేందుకు ఈచిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లను సంబంధించిన విషయాలు పొందు పరుస్తున్నట్లు తెలుస్తోంది.
'రేయ్' చిత్రం ద్వారా సయామీ ఖేర్ అనే భామ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. అదే విధంగా హీరోయిన్ శ్రద్ధాదాస్ ఈ చిత్రంలో పర్మినెంట్ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం 'రేయ్' షూటింగ్ చివరి దశకు చేరుకుంది.


Click it and Unblock the Notifications












