For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫన్..ఫ్యామిలీ: 'సుబ్రమణ్యం ఫర్ సేల్' ప్రివ్యూ

  By Srikanya
  |

  హైదరాబాద్: ఆ మధ్యన ...'పిల్లా నువ్వు లేని జీవితం' అంటూ పలకరించిన ...సాయి ధరమ్ తేజ్ చేస్తున్న మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్ ‘. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ రోజు రిలీజ్ కు సిద్దమైంది. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ కొత్తగా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

  చిత్రంలో హీరో...చిన్నప్పటి నుంచి డబ్బు సంపాదించాలని తపిస్తూంటాడు. అందుకే అమెరికా వెళ్లి రెస్టారెంట్‌లో వెయిటర్‌లా, టాక్సీ డ్రైవర్‌గా.. డబ్బు కోసం ఇలా చాలా ఉద్యోగాలు చేస్తుంటాడు. ఆ టైంలోనే హీరోయిన్‌కు సంబంధించిన ఓ సమస్యను సాల్వ్ చేస్తాడు. ఈ క్రమంలోనే తనతో ప్రేమలో పడి, దాన్ని పెళ్లి దాకా ఎలా తీసుకెళ్లాననే ది మిగతా కథ.

  'మిస్సమ్మ', 'మొగుడు కావాలి', 'బావగారూ! బాగున్నారా' - ఇలా చాలా సినిమాల్లో హీరో ఓ హీరోయిన్ కథలోకి ఎంటర వుతాడు. ఇలా చాలా సినిమాల్లోని ప్యాట్రన్‌లోనే ఇదీ ఉంటుంది. తనని తాను అమ్మకానికి పెట్టుకునే ఓ యువకుడి కథ ఇది. అతను అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఓ లక్ష్యాన్ని చేరుకోవడానికా? లేక ఏదైనా బాధ్యతను నెరవేర్చడానికా?అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అమెరికా నేపథ్యంలో కథ నడుస్తుంది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే చిత్రమిది. ఈ మధ్యకాలంలో అమెరికాలో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకున్న చిత్రమిదే .

  Sai Dharma Teja's Subramanyam for Sale preview

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  చిత్రం విశేషాలకు వెళ్తే...

  ''ఇప్పటివరకూ కథనే నమ్ముకొని సినిమాలు తీశాం. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' కూడా చక్కని కథతో రూపొందనున్న సినిమా. హరీశ్ శంకర్‌తో నేను తీసిన 'రామయ్య వస్తావయ్యా' అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేదు. అయినా... అతని ప్రతిభపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాతో సాయిధరమ్‌తేజ్ స్టార్ హీరో అవుతాడు'' అని 'దిల్' రాజు అన్నారు.

  అలాగే ..'దిల్' రాజు మాట్లాడుతూ - ''సాయిధరమ్‌తేజ్ నటించిన సినిమా ఏదీ విడుదల కాకముందే... అతను హీరోగా సినిమాను ప్రారంభించామంటే... అతనిపై, హరీశ్‌శంకర్ కథపై మాకున్న నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. '' అని తెలిపారు. '''మిరపకాయ్' టైమ్‌లోనే ఈ టైటిల్‌ని మీడియాకు తెలియజేశాను. అప్పట్నుంచీ ఈ కథపై కసరత్తులు చేస్తూనే ఉన్నాను.

  అయితే... ఎవరితో చేయాలనేది మాత్రం క్లారిటీ లేదు. 'గబ్బర్‌సింగ్' టైమ్‌లో పవన్‌కల్యాణ్‌గారితో సాయిధరమ్‌తేజ్‌ని చూశాను. తొలి చూపులోనే నచ్చేశాడు. 'పిల్లా నువ్వులేని జీవితం' ప్రోమోస్ చూశాక నా సుబ్రమణ్యం ఇతనే అని ఫిక్స్ అయిపోయాను. సీత అనే పాత్రను రెజీనా చేస్తోంది. చాలా కొత్తగా ఉంటుందా పాత్ర. సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్‌తో తొలిసారి పనిచేస్తున్నాను. ప్రతిభావంతులైన టీమ్ పనిచేస్తున్న వినోదాత్మక ప్రేమకథ ఇది'' అని హరీశ్‌శంకర్ తెలిపారు.

  బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
  నటీనటులు : సాయిధరమ్‌తేజ్‌.రెజీన కసాండ్ర , సుమన్‌, కోట శ్రీనివాసరావు, నాగబాబు, రావు రమేశ్‌, పృథ్వీ, ప్రభాస్‌ శ్రీను తదితరులు
  సంగీతం: మిక్కీ జే. మేయర్‌,
  ఫొటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌,
  ఎడిటింగ్‌: గౌతంరాజు,
  స్ర్కీన్‌ప్లే: రమేశ్‌రెడ్డి, సతీశ్‌ వేగేశ్న, తోట ప్రసాద్‌,
  సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌,
  నిర్మాత: దిల్‌ రాజు,
  కథ, మాటలు, దర్శకత్వం: హరీశ్‌శంకర్‌ ఎస్‌
  విడుదల తేదీ : 24 సెప్టెంబర్, 2015.

  English summary
  Subramanyam for Sale film ready to release today. Subramanyam for Sale Movie Story is Inspired From the Mega Star Chiru Biggest Block Buster Films Like ‘Mogudu Kavali’ and ‘Bavagaru Bagunara’. and Guvva Gorinka Song Remake Song is Main Highlight For the Movie to Attract the Families to the Movie. And Sai Dharam Tej will Act as Regina’s Husband in his office in the Movie. The film will take Sai Dharam Tej to a new level and Bhrami's comedy is said to be the main highlight in the film. Mickey J Meyer's music adds the right feel and the film is touted to be an action-packed entertainer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X