వండర్...నాగార్జునకు కనిపించిన ‘సాయిబాబా’
షిరిడి సాయిబాబా భక్తులకు స్వయంగా దర్శనం ఇస్తుంటాడని మనం చాలా సందర్భాల్లో విన్నాం. తాజాగా టాలీవుడ్ స్టార్ నాగార్జునకి కూడా వాళ్ల ఇంట్లో సాయినాథుడు దర్శనం ఇచ్చారట. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా వెల్లడించారు. సాయిబాబును తాను నమ్మడం మొదలు పెట్టినప్పటి నుంచి నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయని అంటున్నారు నాగ్.
తాను షిరిడి సాయి సీనిమా ఒప్పుకోవడానికి రెండు మూడు నెలల ముందు సాయి నా జీవితంలోకి ప్రవేశించారు. ఒక రోజు నేను ఎవరికీ చెప్పకుండా షిరిడి వెళ్లి హైదరాబాద్ వచ్చాను. అనంతరం రాఘవేంద్రరావు గారు షిరిడి సాయి సినిమా చేద్దామనే ఆలోచనతో తన వద్దకు వచ్చారు. నేను వెంటనే ఒప్పుకున్నాను. నేను ఎక్కడికి వెళ్లినా సాయి నావెంటే ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక రోజు రాత్రి సాయి నాకు స్వయంగా దర్శనం ఇచ్చారు. మెరిసే రేడియం రూపంలో కనిపించారు. దాన్ని మా ఇంట్లోని కుటుంబ సభ్యులుగానీ, పని వారు గానీ ఎవరూ తేలేదు. అప్పటి నుంచి బాబా మహిమలు మళ్లీ మళ్లీ చూశాను అని చెప్పుకొచ్చారు నాగార్జున.
నాగార్జున రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'షరిడి సాయి' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పార్టు పూర్తయింది. ఈ చిత్రం ఆడియో జులై 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. షిరిడి సాయి చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











