twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వినాయకుడు దర్శకుడి 'కర్మ'

    By Staff
    |

    SAi Kiran Adivi
    కొత్త కాన్సెప్ట్ తో రూపొందించిన 'వినాయకుడు' హిట్టవటంతో ఆ చిత్ర దర్శకుడు సాయికిరణ్ అడవి మరో చిత్రానికి అంకురార్పణ చేసారు. అయితే ఈ సారి దర్శకుడుగా కాదు ..సమర్పకుడుగా. అతని సమర్పణలో 'కర్మ' (డు యు బిలీవర్) అనే తెలుగు చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం ద్వారా అడివి శేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కాలిఫోర్నియాలోని శివ విష్ణు మందిరంలో వసంత పంచమి రోజున గణపతి హోమంతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

    దర్శకుడు అడివి శేష్ ఈ చిత్రంలో అమెరికా నటి జడే టైలర్, షేర్ అలితో కలిసి నటించనున్నారు. సంగీతానికి సంబంధించి ముగ్గురు అమెరికా సంగీత దర్శకులు, కొత్త తరం సినిమాటోగ్రాఫర్ జేమ్స్ లాక్స్ టన్ ను తెలుగు సినిమాకి పరిచయం చేయబోతున్నారు. రెడ్ ఫోర్ కె కెమెరా టెక్నాలజీతో రూపొందే ఈ చిత్రం రొటీన్ కి భిన్నంగా రివల్యూషనరీ ధాట్స్ తో తయారవుతుందంటున్నారు..నిర్మాతలు సాయికిరణ్ అడవి, భవాని అడవి, హరీష్ సింగ్. ఈ చిత్రం షూటింగ్ కు ముందే యాడ్ ల్యాబ్స్ ఇన్ కార్పొరేషన్ సంస్థ నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను తీసుకోవడం విశేషం.బెస్టాఫ్ లక్ సాయికిరణ్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X