‘ఈగ’ నిర్మాత చేతికి అమీర్ ఖాన్ ‘ధూమ్-3’
హైదరాబాద్: నిర్మాతగా తొలి చిత్రం 'ఈగ'తోనే హిట్ కొట్టిన నిర్మాత సాయి కొర్రపాటి. ఆ చిత్రంతో కేవలం రికార్డులను మాత్రమే కాకుండా పలు ప్రతిష్టాత్మక అవార్డులు కూడా అందుకున్నారాయన. ప్రస్తుతం 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న 'లెజెండ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా సాయి కొర్రపాటి బాలీవుడ్ సూపర్ హిట్ సిరీస్ 'ధూమ్' మూడో భాగంగా రాబోతున్న 'ధూమ్-3' ఆంధ్రా-సీడెడ్ పంపిణీ హక్కులను అత్యధిక మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నారు. 'ధూమ్' సిరీస్‌లో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాల్లో..జాన్ అబ్రహం(ధూమ్), హృతిక్ రోషన్(ధూమ్-2) ప్రతి నాయక ఛాయలున్న పాత్రలు పోషించగా...బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, ఉదయ్ చోప్రా కీలక పాత్రలు పోషిచారు.
'ధూమ్-3'లో కూడా అభిషేక్ బచ్చన్-ఉదయ్ చోప్రా నటిస్తుండగా....'3 ఇడియట్స్' చిత్రంతో భారతదేశ కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టి రూ. 300 కోట్ల వసూళ్లు సాధించిన మొట్ట మొదటి కథానాయకుడిగా చలన చిత్ర చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్నిఏర్పరచుకున్న అమీర్ ఖాన్ ఈచిత్రంలో హీరోగా నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ హీరోయిన్.
ఇప్పటికే విడుదలైన 'ధూమ్ 3' ట్రైలర్స్, ప్రోమో సాంగ్స్ యూ ట్యూబులో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నెల 20న విడుదలకు సిద్ధమవుతున్న 'ధూమ్ 3' చిత్రానికి ఏర్పడిన క్రేజ్‌ను సమీక్షించిన సినీ పండితులు..ఈ చిత్రం తప్పకుండా ఈ చిత్రం 500 కోట్ల మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications












