రాధిక ఆప్టే షాకింగ్ కామెంట్స్‌పై..‘లెజెండ్’ నిర్మాత స్పందన
హైదరాబాద్: తెలుగులో ‘రక్త చరిత్ర', ‘ధోని', ‘లెజెండ్' చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ముంబై భామ రాధిక ఆప్టే. ఇటీవల రాధిక ఆప్టే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒక తెలుగులో తప్ప మిగతా అన్ని రీజనల్ లాంగ్వేజీల్లోనూ వర్క్ బాగా ఎంజాయ్ చేసానని, తెలుగు సినీ పరిశ్రమలో పురుషాధిక్యత ఎక్కువ అంటూ కామెంట్ చేసింది. ‘తెలుగు సినీ పరిశ్రమలో పురుషాధిక్యత ఎక్కువ. వారు అహంకార పూరితంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో నన్ను చాలా బ్యాడ్ గా ట్రీట్ చేసారు అని వ్యాఖ్యానించారు.
రాధిక ఆప్టే వ్యాఖ్యలపై ‘లెజెండ్' చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి స్పందించారు. ‘లెజెండ్' సినిమా సమయంలో రాధిక ఆప్టేకు మా టీం ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. ఆమె వర్క్‌కు ఇంప్రెస్ అయిన అంగ్రిమెంటు కంటే ఎక్కువ మొత్తమే చెల్లించామని తెలిపారు. ఆమె ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేసిందో తెలియదన్నారు. ‘లయన్' దర్శకుడు సత్యదేవ మాట్లాడుతూ...అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసిందో? ఎవరిని ఉద్దేశించి చేసిందో అని అయోమయం వ్యక్తం చేసారు.

రాధిక ఆప్టే హాట్ టాపిక్...
రాధిక ఆప్టే గత కొన్ని రోజులుగా వరుసగా సెక్స్ గురించి కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె నటించిన ‘హంటర్ర్' చిత్రం బాలీవుడ్ మంచి విజయం సాధించింది. ఇందులో ఆమె పెళ్లికి ముందు గర్భం దాల్చి, అబార్షన్ చేయించుకున్న పాత్ర చేసింది.
తన పాత్ర గురించి రాధిక ఆప్టే మాట్లాడుతూ...‘హంటర్ర్ చిత్రంలో నేను పోషించిన పాత్ర పెళ్లికి ముందే గర్భం దాలుస్తుంది. అబార్షన్ జరుగుతుంది. ఇప్పటి పరిస్థితులకు అద్దం పట్టే పాత్ర. ఈ జనరేషన్లో పరిస్థితులు పూర్తిగా మారాయి. అమ్మాయిలు ఎవరూ సతీసావిత్రిల్లా ఉండటం లేదు. సెక్స్ కోసం పెళ్లి వరకు ఎవరూ ఆగడం లేదు. నా స్నేహితులంతా పెళ్లికి ముందే సెక్స్ సుఖం అనుభవించిన వారే. అలా లేని వారయితే నాకు తెలియదు' అని వ్యాఖ్యాంచింది.
సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడటం మన దగ్గర పెద్ద ఇష్యూ. అందుకే సినిమాల్లో దాన్ని వ్యాపారం చేసి అమ్ముకుంటున్నారు. ఆకలేస్తే అన్నమెలా తింటామో... శరీరానికి సెక్స్ కూడా కనీస అవసరం. ఇది ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది రాధికా ఆప్టే.


Click it and Unblock the Notifications











