twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాయి కొర్రపాటి ఎంట్రీ: ‘రాజు గారి గది’పై అంచనాలు పెరిగాయి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సినిమా డిస్ట్రిబ్యూటర్ గా అనేక పెద్ద సినిమాలతో విజయవంతంగా బిజినెస్ చేసిన నిర్మాత సాయి కొర్రపాటి ‘ఈగ'తో నిర్మాతగా అడుగు పెట్టి పాపులర్ అయ్యాడు. ఈగ లాంటి పెద్ద సినిమాలు మాత్రమే కాదు, ఆయన నిర్మించిన చిన్న సినిమా ‘ఊహలు గుసగుసలాడే' కూడా డీసెంట్ హిట్టయింది.

    ఇటీవల సాయి కొర్రపాటి ఓ హారర్ ఫిల్మ్ చూసి షాకయ్యారట. ఆ సినిమా మరేదో కాదు... ఓకాంర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజు గారి గది'. సాయి కొర్రపాటికి సినిమా బాగా నచ్చడంతో వెంటనే ఏపీ, తెలంగాణ రైట్స్ ఫ్యాన్సీ ప్రైస్‌కు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. సాయి కొర్రపాటి ఏదైనా సినిమాకు కమిట్ అయ్యారంటే అది హిట్టవుతుందనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. దీంతో ‘రాజు గారి గది' చిత్రంపై అంచనాలు పెరిగాయి.

    దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ ‘''రాజుగారి గది' పక్కా ప్రణాళికతో రూపొందిన హర్రర్ కామెడి చిత్రం. సినిమా చాలా బాగా వచ్చింది. అనుకున్న టైమ్ లో, అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేసిన చిత్రం ఇది. ఇటీవల విడుదల చేసిన లోగో, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని చూసి నచ్చడంతో ప్రముఖ నిర్మాతలు సాయికొర్రపాటిగారు, అనీల్ సుకంరగారు సమర్పకులుగా వ్యవహరించడం చాలా హ్యపీగా ఉంది. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదల చేస్తున్నాం. భయం, హాస్యంతో పాటు పర్పస్ ఉన్న మూవీ. చాలా కష్టపడి చేశాం. డిఫరెంట్ పాయింట్ తో తెరకెక్కిన ఈ హర్రర్ కామెడి ప్రేక్షకులకు తప్పకండా నచ్చుతుంది'' అన్నారు.

    Sai Korrapati saw a horror film and got shocked

    ఆశ్విన్ బాబు,ధన్య బాలకృష్ణన్, చేతన్, ఈశాన్య, పూర్ణ ప్రధాన పాత్రధారులు. ఆర్.దివాకరన్, ప్రవీణ.ఎస్ లైన్ ప్రొడ్యూసర్స్. కళ్యాణ చక్రవర్తి ఎగ్జిక్టూటివ్ ప్రొడ్యూసర్. ఓంకార్ దర్శకుడు. ఈ సినిమాని దసరాకానుకగా అక్టోబర్ 22న విడుదల చేస్తున్నారు. పోసాని కృష్ణమురళి, రఘుబాబు, రాజీవ్ కనకాల,పవిత్రా లోకేష్, షకలక శంకర్, ధనరాజ్, సప్తగిరి, ప్రభాస్ శ్రీను, ధనరాజ్, విద్యుల్లేఖ రామన్ ఇతర పాత్రధారులు.

    ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, పాటలు: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, డ్యాన్స్: శేఖర్, ఆర్ట్: సాహి సురేష్, ఫైట్స్: వెంకట్, ఎడిటర్: నాగరాజ్, సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ఎస్‌.జ్ఞాన‌మ్‌ఎస్. లైన్ ప్రొడ్యూసర్స్: ఆర్.దివాకరన్, ప్రవీణ్.ఎస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కళ్యాణ్ చక్రవర్తి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఓంకార్.

    English summary
    Recently Sai Korrapati saw a horror film and got shocked. It's none other than Omkar's "Raju Gari Gadhi" and after watching the film Sai has given a cheque to Omkar asking a price. It's heard that Sai has brought the film for out-rate for both Telangana and Andhra Pradesh. It happened only for few directors as big distributors like Dil Raju purchased films like Ala Modalaindi and Ee Rojullo in same way.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X