బాలయ్య పొలిటికల్ కాంపెయిన్ వెనక ఆ నిర్మాత!
హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నందమూరి బాలయ్య పొలిటికల్ ఎంట్రీ ఖరారైంది. ఆయన హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నామినేషన్ కూడా దాఖలు చేసారు. బాలయ్య పొలిటికల్ ఎంట్రీ ఖరారు కావడంతో ఆ నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు కూడా ముమ్మరం చేసారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కార్యక్రమాలను 'లెజెండ్' నిర్మాతల్లో ఒకరైన సాయి కొర్రపాటి చూసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఏరియాలో సాయి కొర్రపాటికి మంచి పట్టు ఉండటంతో ప్రచారానికి సంబంధించిన బాధ్యతలు ఆయనకు అప్పజెప్పినట్లు తెలుస్తోంది.

'లెజెండ్' సినిమా విషయానికొస్తే....మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'లెజెండ్' నందమూరి అభిమానులతో పాటు యావత్ సినీ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుని ఘన విజయం సొంతం చేసుకుందని, తొలివారంలోనే 33 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈ చిత్రం రూ. 50 కోట్లు వసూలు చేసిన క్లబ్బులో చేరింది.
'లెజెండ్' చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయంలో నటించారు. సోనాల్ చౌహాన్, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి.


Click it and Unblock the Notifications











