ఆ సినిమాతో సర్వం కోల్పోయాడట.. ప్రస్తుతం సాయి కుమార్ మొత్తం ఆస్తి ఎంతంటే?

ఒక్క సినిమా జీవితాన్ని నిలబెట్టగలదు. అదే ఒక్క సినిమా జీవితాన్ని తల కిందులు చేయగలదు. అందుకే సినిమా అదే ఓ చదరంగం లాంటిది. ఎంతో జాగ్రత్తగా ఎత్తులు వేయాల్సి ఉంటుంది. సరైన కథలను ఎంచుకుంటూ, సరైన సినిమాలను నిర్మిస్తూ ముందుగా సాగాల్సి ఉంటుంది. ఒక్కోసారి తీసుకునే తప్పుడు నిర్ణయం జీవితం మొత్తాన్ని వెంటాడుతూనే ఉంటుంది. డైలాగ్ కింగ్ సాయి కుమార్ జీవితంలోనూ అలాంటి ఓ సినిమా ఉంది. ఆ సినిమా మిగిల్చిన నష్టాలను పూడ్చడానికి కెరీర్ మొత్తాన్ని పణంగా పెట్టాల్సి వచ్చిందట. ఆ కథ ఏంటో ఓసారి చూద్దాం.

సొంత నిర్మాణంలో..

సొంత నిర్మాణంలో..

పీజే శర్మ సినిమా రంగంలో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ వస్తున్నాడు. అదే సమయంలో సాయి కుమార్ కూడా డబ్బింగ్ అంటూ కెరీర్‌ను మొదలుపెట్టి హీరోగా నిలబడే ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతా బాగుందనుకున్న సమయంలోనే ఓ చిత్రాన్ని సొంతంగా నిర్మించి అంతా పోగొట్టుకున్నారట.

దాసరి సహకారంతో..

దాసరి సహకారంతో..

సాయి కుమార్ తమ్ముడు అయ్యప్ప శర్మ దర్శకత్వంలో పీజే శర్మ విలన్‌గా ఈశ్వర్ అల్లా సినిమాను నిర్మించారు. ఆ సినిమాను అప్పట్లోనే రెండు కోట్ల బడ్జెట్‌తో భారీగా నిర్మించారట. సినిమా చూసిన ఏ ఒక్క బయర్ కూడా సినిమాను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదట. అయితే దాసరి చొరవతో సినిమా ఎలాగోలా విడుదలైందట.

 విలన్‌గా చేయడం..

విలన్‌గా చేయడం..

ఈశ్వర్ అల్లా మంచి చిత్రమే అయినప్పటికీ పీజే శర్మను విలన్‌గా ప్రేక్షకులు అంగీకరించకపోయారట. తన తండ్రినే తాను కొట్టడం ప్రేక్షకులు తీసుకోలేకపోయారని సాయి కుమార్ వివరించాడు. సినిమా కోసం చేసిన అప్పు తీర్చడానికి, స్టూడియోలకు కట్టాల్సిన బాకీలను తీర్చడానికి కొన్నేళ్లు పట్టిందని తెలిపాడు.

 అప్పులకే సరిపోయాయ్..

అప్పులకే సరిపోయాయ్..

ఈశ్వర్ అల్లా అప్పులను తీర్చడానికి తాను నిరంతరం కష్టపడ్డాడని సాయి కుమార్ తెలిపాడు. సినిమాలు చేయడం, వచ్చిన డబ్బులతో అప్పులు చెల్లించడం జరుగుతూ వచ్చిందన్నాడు. అలా రామానాయుడు స్టూడియో, ప్రసాద్ ల్యాబ్ ఇలా ఒక్కొక్కరికి సెటిల్ చేశానని పేర్కొన్నాడు.

Recommended Video

Shakeela To Release Her Film In OTT Platform
 మొత్తం ఆస్తి..

మొత్తం ఆస్తి..

సాయి కుమార్‌కు చాలా ఆస్తి ఉందని బయట అనుకుంటారు గానీ అంతలేదని తెలిపాడు. మొన్న ఎన్నికల్లో భాగంగానే అఫిడవిట్ సమర్పించేందుకు లెక్కలు తిరిగేస్తే మొత్తం ఐదు కోట్లు వరకు ఉందని చెప్పుకొచ్చాడు. ఆ ఒక్క సినిమా సాయి కుమార్ జీవితం మొత్తాన్ని వెనక్కి నెట్టినట్టైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X