తండ్రినే కొట్టేందుకు వచ్చిన ‘సుకుమారుడు’.. అలా చేయడంతో సాయి కుమార్ షాక్

సాయి కుమార్ వారసత్వంగా ఆది సినీ రంగ ప్రవేశం చేశాడు. మొదటి చిత్రం ప్రేమ కావాలితో సూపర్ హిట్ కొట్టాడు. యాక్షన్, డ్యాన్స్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. లవ్‌లీ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆపై సక్సెస్ కోసం తెగ ట్రై చేస్తూనే ఉన్నాడు. చివరగా వచ్చి ఆపరేషన్ గోల్డ్ ఫిష్, జోడి వంటి చిత్రాలు కూడా నిరాశ పరిచాయి.

అయితే రీసెంట్ ఆది.. ఓ ఘటన గురించి వివరించాడు. తండ్రి సాయి కుమార్‌తో జరిగిన ఓ ఘటనపై స్పందించాడు. అలీ నిర్వహించే షోలో పాల్గొన్న సాయి కుమార్, ఆదిలు ఎన్నో విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగా తండ్రీ కొడుకుల మధ్య జరిగిన ఓ ఘటన గురించి వివరించారు.

సినిమాలా? క్రికెటా?

సినిమాలా? క్రికెటా?

ఆది అసలు పేరు ఆదిత్య. అయితే సినిమాల్లో ఆదిగా మార్చేశారని తెలిపాడు. తనకు ముందు నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టమని, అండర్ 19లో స్టేట్ లెవెల్‌లో ఆడానని చెప్పుకొచ్చాడు. అయితే క్రికెట్ ప్రాక్టీస్ చేసే సమయంలో డ్యాన్స్ క్లాసులకు కూడా వెళ్లేవాడినని తెలిపాడు.

లారెన్స్ మాస్టర్ వద్ద..

లారెన్స్ మాస్టర్ వద్ద..

తాను లారెన్స్ మాస్టర్ వద్ద డ్యాన్సుల్లో శిక్షణ తీసుకున్నానని తెలిపాడు. మొదట తనకు అంతగా డ్యాన్స్ వచ్చేది కాదని, అయితే తనపై మాస్టర్ బాగా శ్రద్ద పెట్టాడని, తొందర్లోనే డ్యాన్స్ నేర్చుకున్నాని తెలిపాడు. అయితే ఓ ఈవెంట్‌లో తాను డ్యాన్స్ చేశానని అప్పటి నుంచి సినిమాల్లోకి రావాలని ఫిక్స్ అయినట్టు డాడీకి చెప్పానని తెలిపాడు. ఆపై జిమ్మాస్టిక్, యాక్షన్ సీక్వెన్స్‌, సినిమాకు కావాల్సిన శిక్షణ తీసుకున్నానని పేర్కొన్నాడు.

స్పోర్ట్స్ అంటే ఇష్టం..

స్పోర్ట్స్ అంటే ఇష్టం..

ఎప్పుడైనా సాయి కుమార్ కొట్టాడా? అని ఆదిని అలీ అడిగాడు. ఎప్పుడూ కొట్టలేదని ఆది చెబుతుండగా.. మధ్యలో సాయి కుమార్ కలగజేసుకుని వాడే నన్ను కొట్టాడని చెప్పుకొచ్చాడు. అయితే ఆ సంఘటనను ఆది వివరించాడు. ఓ సారి వింబుల్డన్ మ్యాచ్ చూస్తుంటే అక్క, డాడీ డిస్టర్బ్ చేస్తున్నారని, అసలే మ్యాచ్ పీక్స్‌లో ఉందని, నాదల్-ఫెదరర్ మధ్య మంచి పోరు జరుగుతోందని తెలిపాడు.

అలా గోడను గట్టిగా కొట్టాను..

అలా గోడను గట్టిగా కొట్టాను..

అలా మ్యాచ్‌ను అంత సీరియస్‌గా చూస్తుంటే డిస్టర్భ్ చేశారని, మ్యాచ్ పోయిందని ఆ ఫ్రస్ట్రేషన్‌లో గోడను గట్టిగా కొట్టానని ఆది క్లారిటీ ఇచ్చాడు. అప్పుడు సాయి కుమార్ అందుకుని.. నన్ను కొడతావా ఏంటి? అని షాక్ అయ్యానని, వెంటనే సురేఖ(సాయి కుమార్ భార్య)తో ఏంటి ఇదని అడిగానని చెప్పుకొచ్చాడు. అలా తండ్రీ కొడుకుల మధ్య జరిగిన ఘటనను మొత్తానికి బయటపెట్టారు.

Recommended Video

Shakeela To Release Her Film In OTT Platform
ప్రాజెక్ట్‌ల గురించి..

ప్రాజెక్ట్‌ల గురించి..

ఆది ప్రస్తుతం బ్లాక్, శశి అనే రెండు ప్రాజెక్ట్‌లను చేస్తున్నట్టు తెలిపాడు. అందులో శశి దాదాపుగా పూర్తయిందని, సమ్మర్ రిలీజ్ చేయాలి కానీ లాక్ డౌన్ వల్ల అంతా మారిపోయిందని తెలిపాడు. ఇక తమిళ, తెలుగు భాషల్లో మరో చిత్రాన్ని చేస్తున్నట్టు పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X