twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమరావతి శంకుస్థాపన‌: సాయికుమార్‌ యాంకరింగ్

    By Surya
    |

    హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ప్రముఖ సినీనటుడు సాయికుమార్‌ను ఎంపిక చేశారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం నిర్వహణపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు.

    sai kumar

    సభ ప్రారంభానికి ముందు ప్రఖ్యాత కళాకారుడు శివమణి వాద్య ప్రదర్శన, కూచిభొట్ల ఆనంద్ నేతృత్వంలో మన అమరావతి, రైతుకు వందనం జానపద, కూచిపూడి నృత్యరూపకాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

    అలాగే ...ప్రధాన వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు సహా మరో 15 మందికి ఆసనాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ప్రముఖులు, న్యాయమూర్తులకు మరో రెండు ఇతర వేదికలను ఏర్పాటు చేస్తున్నారు.

    ఈ వేదికలను విదేశీ రాయబారులు, కార్పొరేట్‌ కంపెనీల అధిపతులు, పార్లమెంట్‌ సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలకు కేటాయించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్‌.ఎల్‌.దత్తు హాజరుకానున్నట్లు తెలిపారు.

    మట్టి, నీరు కలశాలను అందరికీ కన్పించేలా ప్రదర్శించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వేదికపై ప్రదర్శించే నృత్య రూపకాలకు కళాకారులు శివమణి, కూచిభొట్ల ఆనంద్‌ నేతృత్వం వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్థికశాఖామంత్రి యనమల రామకృష్ణుడు, డీజీపీ రాముడు తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Oct 22nd fixed as auspicious day to lay the first stone for construction of the AP capital. Actor Sai Kumar, who is considered as a dialogue king roped as anchor for the event. Its known that few days before he is named the brand ambassador for the City police department.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X