సింహాల ఫ్యామిలీ! సాయికుమార్ వెరైటీ ఇన్విటేషన్
ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్ తన కూతురు పెళ్లి గురించి ఓ వెరైటీ ఇన్విటేష్ తయారు చేయించారు. అందులో తమను తాము సింహాల కుటుంబం చెప్పుకున్న సాయికుమార్, వాళ్లావిడతో సహా అందరికీ సింహం బిరుదు తగిలించారు. ఆగస్టు 9 సాయికుమార్ కూతురు వివాహం జరుగనుందట. పోలీస్ స్టోరీ చిత్రంలో నటించినప్పుడు సాయికుమార్ 'కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్' అంటూ కొట్టిన డైలాగ్ చాలా ఫేమస్ అయింది. బహుషా ఆ నేపథ్యంలో తనకు తానుగా ఈ సింహం బిరుదు తగిలించుకుని ఉంటారు.
ఆ ఇన్విటేషన్‌పై ఓ లుక్కేయండి...ఇన్విటేషన్లోని వివరాలు...
మా అమ్మాయి 'జ్యోతిర్మయి' పెళ్లి కుదిరింది
పెళ్లికొడుకు 'కృష్ణ ఫల్గుణ'
రిసెప్షన్...ఆగస్ట్ 9న సాయంత్రం-గురువారం రాత్రి 7 గంటలకు
మీరెంత బీజీగా ఉన్నా దయచేసి ఈ 'డేటు'నోటు చేసుకోవాల్సిందిగా ప్రార్థన
మీ ఆశీస్సులతో ఎదిగిన వాణ్ణి..
మా పాపని, మా అల్లుణ్ణి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ...
'పెళ్లి ప్రతికతో కలుస్తాము'
మీ
'నాలుగో సింహం' సాయికుమార్
'లేడీ సింహం' సురేఖా సాయికుమార్
'బాల సింహం' ఆది
'వృద్ధ సింహం' పి.జె.శర్మ


Click it and Unblock the Notifications












