RRR: తారక్ మాటలకు గూస్ బంప్స్ రావాల్సిందే.. మరోసారి క్లారిటీ ఇచ్చిన స్టార్ రైటర్
జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా RRRపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి నెవ్వర్ బిఫోర్ అనేలా విజువల్ ట్రీట్ తో పాటు మంచి ఎమోషన్ ను కూడా వెండితెరపై ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైటర్ విజయేంద్రప్రసాద్ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ పై క్లారిటీ ఇచ్చారు.
రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం బీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ స్టార్స్ ఇద్దరు కూడా సినిమా కోసం వారి బలాన్ని మొత్తం ఉపయోగించారని ఫస్ట్ లుక్ టీజర్స్ చూసాకే అర్ధమయ్యింది. ఇక ఇటీవల మాటల రచయిత సాయి మాధవ్ బుర్ర కూడా సినిమాలోని డైలాగ్స్ పై వివరణ ఇచ్చారు.

ముఖ్యంగా సినిమాలో ఎన్టీఆర్ చెప్పే దేశభక్తి డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయట. సీన్స్ కు తగ్గట్లుగానే ఇద్దరు హీరోలకు సమానమైన డైలాగ్స్ ఉంటాయని చెబుతూ ఎవరు డైలాగ్ చెప్పినా రెండు వర్గాల అభిమానులు ఎంజాయ్ చేసేలా ఉంటాయని అన్నారు. ఇక తారక్ డైలాగ్ డెలివరీ ఈ సినిమాలో మరింత పవర్ఫుల్ గా ఉంటుందని దేశం కోసం చెప్పే మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని టచ్ చేస్తాయని సాయి మాధవ్ చెప్పారు. ఇదివరకే కథ రచయిత విజయేంద్రప్రసాద్ సినిమాలోని సీన్స్ గురించి చెప్పి అంచనాలు పెంచగా ఇప్పుడు మాటల రచయిత మరో విషయాన్ని పెంచి ఆసక్తిని కలుగ జేశారు. మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











