భారత్నరత్నకు అదృష్టం లేదు.. ప్రపంచమంతా ఎన్టీఆర్ అనే అక్షరాలవైపే.. సాయిమాధవ్ ఉద్వేగం
స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమా ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. గురువారం (మార్చి 29) రోజున హైదరాబాద్ నాచారంలోని రామకృష్ణ సినీ స్టూడియో జరిగిన ముహుర్తం షాట్‌కు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బాలకృష్ణపై క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ బయోపిక్ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా ఉద్వేగం ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..
Recommended Video


ఎన్టీఆర్ సినిమా కారణం
ఎలా బతుకాలో ఎన్టీఆర్ గారి సినిమాలు చూసి నేర్చుకొన్నాను. ఎలా నిలబడాలో, ఎలా గెలువాలో, తలబాడలో, కలబాడలాలో, జీవితానికి ఎలా ఎదురు నిలబడాలో నేర్చుకొన్నది ఎన్టీఆర్ సినిమాలు చూసే. ఎన్టీఆర్ లేకపోతే నేను లేను. నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే మా అమ్మ, నాన్న, ఎన్టీఆర్ సినిమా కారణం.

ప్రపంచమంతా ఆయనవైపు
నేనే కాదు, నాలాంటి అభిమానులు కోకొల్లలు, కోటాను కోట్లు ఉన్నారు. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాల వెనుక ఓ జాతి నడిచింది. ఓ రాష్ట్రం నడిచింది. ఓ దేశం నడిచింది. ప్రపంచమంతా విస్తుపోయి గర్వంగా ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలవైపు తలఎత్తి చూసింది.

బాలకృష్ణ ఇచ్చిన వరం
ఎన్టీఆర్ అనే మహానుభావుడి జీవిత కథపై వస్తున్న సినిమాకు నాకు మాటలు రాసే అదృష్టం కలిగింది. ఎవరి స్ఫూర్తితో నడిచానో.. ఎవరి నీడలో నేను నడిచానో.. అలాంటి వ్యక్తిపై రూపొందుతున్న సినిమాకు నేను మాటలు రాస్తున్నాను. అది బాలకృష్ణ గారు ఇచ్చినటు వంటి వరం. ఆ వరాన్ని సద్వినియోగం చేసుకొంటాను. ప్రతీ అక్షరం నా ఆయుష్షును పెంచేలా డైలాగ్స్ రాస్తానని సభాముఖంగా మాట ఇస్తున్నాను అని సాయిమాధవ్ బుర్రా ఉద్వేగంగా ప్రసంగించారు.

భారతరత్నకు అదృష్ణం రాలేదు
తెలుగు జాతి గర్వించే దగిన ఎన్టీఆర్‌కు భారతరత్న రాకపోవడంపై సాయిమాధవ్ బుర్రా స్పందించారు. ఎన్టీఆర్ గొప్పవారు కదా. ఆయనకు భారతరత్న ఎందుకు రాలేదు అని ఎవరో ఒకరు అడిగారు. అందుకు నేను సమాధానం ఇస్తూ భారతరత్నకు ఇంకా అదృష్టం రాలేదు. ఎన్టీఆర్‌ను వరించాలంటే భారతరత్న ఎంతో తపస్సు చేయాలి. ఆ అదృష్టం, తపస్సు ఫలిస్తే భారతరత్న ఎన్టీఆర్‌ను వరిస్తుంది.

ఎన్టీఆర్ ఎంతటి..
ఎన్‌టీఆర్ అనే మూడు అక్షరాలకు సాయి మాధవ్ బుర్రా కొత్త భాష్యం చెప్పారు. ఎన్ అంటే నాటకరంగం, ఆర్ అంటే రాజకీయరంగం. ఒకవైపు నాటకరంగాన్ని, మరోవైపు రాజకీయరంగాన్ని భుజాన వేసుకొని మోస్తూ మధ్య నిలబడిన టీ మన ఎన్టీఆర్. ఆయన జీవిత కథ ఆధారంగా రూపొందే సినిమాకు మాటలు రాసే అవకాశం దక్కింది. నేను అద్భుతంగా మాటలు రాసేలా మీరందరూ ఆశీర్వదించాలి అని సాయిమాధవ్ బుర్రా కోరుకొన్నారు.

బాలయ్య, తేజకు ధన్యవాదాలు
ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌కు మాటలు రాసే అవకాశం ఇచ్చిన బాలకృష్ణ, తేజ, సాయి కొర్రపాటి, విష్ణు తదితరులకు ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను అని సాయిమాధవ్ తన ప్రసంగాన్ని ముగించారు.


Click it and Unblock the Notifications











