Sai Pallavi: ఇన్నాళ్లు భరించాను.. ఇకపై లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటా.. సాయిపల్లవి వార్నింగ్..

Sai Pallavi: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి .. వండర్ఫుల్, అమేజింగ్, ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్ యాక్టర్. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ రోల్ అనే స్థాయి నుండి అంతకుమించి అనేలా ఔచిత్యాన్ని తీసుకువచ్చిన నటుల్లో నటి సాయి ఒక్కరు. తన గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ప్రతి పాత్రను తన కోసమే డిజైన్ చేశారా? అనేలా.. పాత్రలను ఎంచుకుంటుంది. అంతకుమించి అనేలా పాత్రలో జీవిస్తోంది. ఇప్పటి వరకు ఎన్నో హిట్లు అందుకున్న ఈ బ్యూటీ ఇటీవల తనపై వస్తున్న రూమర్స్ పై గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ ఏమైందంటే?

సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా యావత్తు భారతదేశంలో ఈ అమ్మడు కు ప్రత్యేక క్రేజ్ ఉంది. ఇప్పటికే ఎన్నో విజయాలు అందుకున్నది ఈ బ్యూటీ. ఇటీవల అమరన్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య నటించిన తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తరువాత బాలీవుడ్ లో కూడా 'రామాయణ' అనే సినిమాతో సీతాదేవిగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Sai Pallavi Angry With Rumors Warning to media Legal Consequences

'రామాయణ' అనే సినిమాకు నితీష్ తివారి దర్శకత్వం వహించగా.. బాలీవుడ్ నిర్మాతలతో కలిసి అల్లు అర్జున్ రామాయణాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రీరాముడిగా రన్ బీర్ నటిస్తుండగా.. సీతాదేవిగా సాయి పల్లవి కనిపించనున్నారు. అయితే ఈ సినిమా కోసం సాయి పల్లవి తన అలవాట్లను మార్చుకుందని, కొన్ని ప్రత్యేక నియమాలను ఏర్పరచుకుందంటూ కోలీవుడ్ లో ఓ మీడియా సంస్థ పలు కథనాలను వెల్లడించింది.

ఆ కథనం ప్రకారం.. సాయి పల్లవి మాంసాహారం మానివేశారని, హోటల్ లో కూడా తినడం లేదని, విదేశాలకు వెళ్లేటప్పుడు వంట వాళ్లను తన వెంట తీసుకువెళ్తున్నారంటూ ఓ వార్త రాసింది. దీనిపై హీరోయిన్ సాయి పల్లవి ఘటుగా స్పందించింది. ఇలాంటి ఆధారం లేని వార్తలు రాయడం, పుకార్లు సృష్టించడం సరి కాదు అంటూ వార్నింగ్ ఇచ్చింది.

ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఇలా రాస్కొచ్చింది.' నాపై ఎన్నోసార్లు రూమర్స్ క్రియేట్ చేశారు. అలా వచ్చిన ప్రతిసారి నేను మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే.. అందులో నిజం ఎంతో ? ఆ దేవుడికే తెలుసు. కానీ, మౌనంగా ఉంటున్నానుగా అని ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయడం సరికాదు. లేనిపోని వార్తలు రాస్తున్నారు. ఇప్పుడు స్పందించాల్సిన సమయం వచ్చింది.

నా సినిమాల విడుదల నా ప్రకటనలు నా కెరియర్ ఇలాంటి విషయాలను ప్రచురించే ముందు జాగ్రత్తగా ఉండాలని, నిరాధారంగా రాయకూడదు. ఇది గుర్తింపు పొందిన మీడియా సంస్థ అయినా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు సహించాను. ఇలాంటి అసత్య ప్రచారాలను తాను భరించడానికి సిద్ధంగా లేను' అంటూ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం సాయి పల్లవి పోస్ట్ వైరల్ గా మారింది.

More from Filmibeat

Read more about: sai pallavi ramayana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X