For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HBD Sai Pallavi: ఫ్యాన్స్ గుండెల్లో సాయి పల్లవి ఫిదా.. హీరోలతో వివాదాలు.. రౌడీ బేబీ కెరీర్ ఇలా!

  By Manoj
  |

  'భానుమతి.. సింగిల్ పీస్.. హైబ్రిడ్ పిల్ల' ఇదీ ఫిదా సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి చెప్పిన డైలాగ్. ఆమె నిజ జీవితాన్ని ఊహించుకునే దర్శకుడు ఈ డైలాగ్ రాసినట్లున్నాడు. ఆకట్టుకునే అందం.. దానికి తగ్గట్లే అద్భుతమైన యాక్టర్, అన్నింటికీ మించి సూపర్ డ్యాన్సర్.. అందుకే తక్కువ వ్యవధిలోనే ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి పుట్టినరోజు (మే 9) సందర్భంగా.. ఆమె జీవితంలో జరిగిన అత్యంత ముఖ్యమైన పరిణామాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.!

  సాయి పల్లవి అసలు పేరు ఏంటో తెలుసా?

  సాయి పల్లవి అసలు పేరు ఏంటో తెలుసా?

  తమిళనాడులోని ఊటీకి చెందిన సెంతామరై, రాధామణి దంపతుల కుమార్తెనే సాయి పల్లవి. వాస్తవానికి ఆమె పేరు పల్లవి మాత్రమే. కానీ, తల్లి సాయిబాబా భక్తురాలు కావడంతో సాయి పల్లవి అని మార్చారు. ఆమెకు పూజా అనే కవల సోదరి కూడా ఉంది. సినిమాల్లోకి రావడానికి ముందు సాయి పల్లవి.. జార్జియాలో వైద్య విద్యను అభ్యసించింది.

  తెలుగు ప్రేక్షకులకు అప్పుడే పరిచయం

  తెలుగు ప్రేక్షకులకు అప్పుడే పరిచయం


  మొదటి నుంచీ మంచి డ్యాన్సర్ కావడంతో సాయి పల్లవికి నాట్యం నేర్పించారు ఆమె తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన ‘ఢీ' అనే డ్యాన్స్ షోలో పాల్గొంది. అప్పుడే తనదైన శైలి నృత్యంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సమయంలోనే ‘ధూం ధాం' అనే తమిళ సినిమాతో పాటు ‘కస్తూరి మాన్'లో చిన్న చిన్న పాత్రలు చేసింది.

  ఫిదా చేసింది.. ఫేమస్ అయిపోయింది

  ఫిదా చేసింది.. ఫేమస్ అయిపోయింది

  సాయి పల్లవి... తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని పేరిది. కేవలం ఒకే ఒక్క సినిమాతో భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుందామె. చదువు పూర్తయిన వెంటనే ఆమె మలయాళంలో వచ్చిన ‘ప్రేమమ్'లో నటించింది. ఆ సినిమాలో ఆకట్టుకోవడంతో.. తెలుగులో ‘ఫిదా'లో అవకాశం వచ్చింది. ఈ సినిమా వల్ల సాయి పల్లవి ఫేమస్ అయిపోయింది.

  ఆ హీరోలతో గొడవ.. చెలరేగిన వివాదం

  ఆ హీరోలతో గొడవ.. చెలరేగిన వివాదం

  సాయి పల్లవి గొప్ప యాక్టర్, డ్యాన్సర్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఆమె కెరీర్‌ మాత్రం వివాదాలమయంగా సాగుతోంది. ఇప్పటికే ‘ఎంసీఏ' సినిమా సమయంలో నానితో, ‘పడి పడి లేచే మనసు' టైమ్‌లో శర్వానంద్, ‘కణం' సినిమా అప్పుడు నాగ శౌర్యతో గొడవలు పడిందని ప్రచారం జరిగింది. అయితే, ఆ తర్వాత వాటన్నింటినీ ఆమె ఖండించిన సంగతి విధితమే.

  సాయి పల్లవి కెరీర్‌లో లిప్ లాక్ రచ్చ

  సాయి పల్లవి కెరీర్‌లో లిప్ లాక్ రచ్చ

  అన్ని రకాల రసాలను అలవోకగా పండించగలిగే నటి కావడంతో సాయి పల్లవికి మంచి గుర్తింపు వచ్చింది. అదే సమయంలో ఆమె ముద్దు సీన్లు, గ్లామర్ షోకు దూరంగా ఉంటోంది. ఈ కారణంగానే విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్' ఆఫర్‌ను వదులుకుందామే. ఆ సినిమా రిలీజ్ టైంలో ఈ న్యూస్ బయటకు రావడంతో ఇది హాట్ టాపిక్ అయిపోయింది.

  రౌడీ బేబీ‌తో రికార్డులు బద్దలు కొట్టింది

  రౌడీ బేబీ‌తో రికార్డులు బద్దలు కొట్టింది

  సాయి పల్లవి నటించిన సినిమాల్లో చాలా వరకు సూపర్ హిట్ అయినవే ఉన్నాయి. అంతేకాదు, వాటిలో చాలా మూవీలు రికార్డులను క్రియేట్ చేశాయి. వాటిలో ధనూష్‌తో నటించిన ‘మారి 2'లో రౌడీ బేబీ అంటూ సాగే పాట ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటను సాయి పల్లవి కోసమే చూసిన వారు ఎంతో మంది ఉన్నారు.

  Naga Chaitanya Emotional Words On Police
  రెండు సినిమాలూ ఆగిపోయాయి

  రెండు సినిమాలూ ఆగిపోయాయి

  సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి ‘లవ్‌స్టోరీ' అనే సినిమా చేస్తోంది. ఇది లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక, రానాతో కలిసి ‘విరాట పర్వం' చేయాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఈ మూవీ పట్టాలెక్కడం లేదు. వీటితో పాటు మరికొన్ని చిత్రాలకు సంతకాలు చేసి చేతి నిండా సినిమాలతో బిజీగా సాగుతోన్న మన ‘భానుమతి'కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

  English summary
  Sai Pallavi Senthamarai is an Indian film actress and dancer who appears in Tamil, Telugu, and Malayalam films. She is a recipient of several awards including two Filmfare Awards for her performances in the films Premam and Fidaa.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X