పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్.. రెమ్యునరేషన్ డోస్ పెంచిన సాయి పల్లవి
ప్రస్తుతం నెవర్ బిఫోర్ అనేలా ఇండస్ట్రీలో కాంబినేషన్స్ పుట్టుకొస్తున్నాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దాగుబాటి మల్టీస్టారర్ గురించి అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందో తెలియదు గాని అంచనాలు మాత్రం గట్టిగానే పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో నటించే వారి రెమ్యునరేషన్స్ పై కూడా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సాయి పల్లవి పవన్ కళ్యాణ్ కు జోడిగా నటించనున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే. ఆమె కూడా పారితోషికం డోస్ పెంచినట్లు తెలుస్తోంది.

ఫోకస్ మొత్తం షూటింగ్ పైనే..
సినిమా సెట్స్ పైకి వచ్చినా కూడారూమర్స్డోస్ ఏ మాత్రం తగ్గడం లేదు. చిత్ర యూనిట్ కూడా ఆ విషయాలని ఎక్కువగా పట్టించుకోవడం లేదు. వారి ఫోకస్ అంతా కూడా వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తీ చేయాలనే దానిపైనే పెట్టారు. ఎందుకంటెపవన్ కళ్యాణ్ చాలా తక్కువ డేట్స్ ఇచ్చాడు. 45రోజుల లోపేఆయనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయబోతున్నారు.

హీరోల రెమ్యునరేషన్ ఎంతంటే..
ఈ సినిమా బడ్జెట్ ఎంతో గాని సినిమాలోనటిస్తున్న స్టార్ క్యాస్ట్కోసమే ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోందట. పవన్ కళ్యాణ్ అయితే 35కోట్లకు పైగానేతీసుకుంటున్నట్లు గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇక మరో హీరో రానాతన మార్కెట్ పరిధిని బట్టి చేస్తున్నపాత్ర కూడా కీలకం కావున రూ.6కోట్లను అందుకుంటున్నాడట.

సాయి పల్లవి కూడా గట్టిగానే డిమాండ్ చేస్తోందట
ఇక ప్రస్తుతం సాయి పల్లవి రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్ గా మారింది. గత సినిమాలకంటే కూడా ఆమె కాస్త ఎక్కువగానేడిమాండ్ చేస్తోందట. పవన్ కళ్యాణ్ తో సినిమా అనగానే ఆమె రెమ్యునరేషన్విషయంలోపెద్దగా డిమాండ్ చేయకపోవచ్చని అనుకున్నారట. కానీ అమ్మడుఊహించనివిధంగారేటు చెప్పేసరికినిర్మాతలుకన్ఫ్యూజన్ లో పడ్డట్లుతెలుస్తోంది.

ఆమె పారితోషికం ఎంతంటే?
అసలు సినిమా స్క్రిప్ట్దశలో ఉండగానేపవన్ కు జోడిగా సాయిపల్లవినిఫిక్స్ చేశారట. ఆమెను దృష్టిలోఉంచుకొని దర్శకుడు సాగర్ చంద్ర కొన్ని సీన్స్ ను రాసుకున్నట్లు తెలుస్తోంది. అయిత్ ఇప్పుడు ఫిదాబ్యూటీ రెండు కోట్లకుపైగా డిమాండ్ చేస్తూ షాక్ ఇచ్చిందట. ఆమెకు ఆ స్థాయిలో డిమాండ్ ఉన్నప్పటికీ నిర్మాతలుఇప్పటికేభారీ స్థాయిలో సినిమాపైపెట్టుబడి పెట్టారు. ఇక సాయిపల్లవి కూడా అంచనాలకుమించి అడుగుతుండడంతో ఆలోచనలో పడ్డట్లుటాక్.


Click it and Unblock the Notifications











