డేట్ ఫిక్స్: సాయి పల్లవి చాలా కూల్, కానీ అతడు షార్ట్ టెంపర్....
దుల్కర్ సల్మాన్-సాయి పల్లవి ‘కలి’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 8న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సాయిపల్లవి, దుల్కర్ సల్మాన్ జంటగా మళయాలంలో చేసిన 'కలి' చిత్రం అక్కడ భారీ విజయం సాధించింది. 'ఒకే బంగారం' సినిమాతో దుల్కర్ సల్మాన్, 'ఫిదా' మూవీతో సాయి పల్లవి తెలుగులో బాగా పాపులర్ కావడంతో వీరిద్దరు నటించిన ఆ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
షార్ట్ టెంపర్ ఉన్న ఓ కుర్రాడుకి, కూల్ గా ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మాయికు మధ్య జరిగే ప్రేమకథ 'కలి'. తెలుగులో ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 1న ఆడియో రిలీజ్ చేసి, సెప్టెంబర్ 8వ తేదీన సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

‘ఫిదా' ఛాయలతో టైటిల్
ఈ చిత్రాన్ని తెలుగులో డివి కృష్ణ స్వామి రిలీజ్ చేస్తున్నారు. ‘ఫిదా' సినిమాలో సాయి పల్లవి పేరు భానుమతి కావడంతో అదే పేరు టైటిల్ లో వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలో టైటిల్ ఏమిటనేది ఖరారు కానుంది.
Recommended Video


కృష్ణ స్వామి
సినిమా గురించి డి.వి.కృష్ణ స్వామి మాట్లాడుతూ.... యూత్ కు బాగా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాం. ఈ సినిమాకు రెండు టైటిల్స్ అనుకుంటున్నాం. పిల్ల-పిల్లగాడు, మైడియర్ భానుమతి. త్వరలో టైటిల్ ఫైనల్ చేసి అనౌన్స్ చేస్తాం. గోపీ సుందర్ సంగీత సారధ్యంలో రూపొందిన రెండు పాటలు తెలుగులోనూ మంచి హిట్ అవుతాయని నమ్మకంతో ఉన్నాం. " అన్నారు.

లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్
ఎగ్జిక్యూటర్ ప్రొడ్యూసర్ దక్షిణ్ శ్రీనివాస్ మాట్లాడుతూ... " షార్ట్ టెంపర్ ఉన్న ఓ కుర్రాడుకి, కూల్ గా ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మాయికు మధ్య జరిగే ప్రేమకథ. ఇందులో లవ్ ఎపిసోడ్స్ తో పాటు యాక్షన్ కూ చోటు ఉంది. ఈ సినిమాలో వచ్చే నాలుగు ఫైట్స్ కూడా నాలుగు రకాలుగా డిఫరెంట్ గా డిజైన్ చేసారు. ముఖ్యంగా హైవే మీద వచ్చే లారీ ఛేజ్ ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తుంది. కామెడీ సీన్స్ కూడా సినిమాలో హైలెట్ అవుతాయి" అన్నారు.

తెర వెనక
ఈ చిత్రానికి మాటలుః భాష్య శ్రీ, సాహిత్యంః సురేంద్ర కృష్ణ, భాష్య శ్రీ, సంగీతంః గోపీసుందర్, సినిమాటోగ్రఫీః గిరీష్ గంగాధరన్, ఫైట్స్: రాజశేఖర్, జాలీ బాస్టియన్, పీఆర్వో : బియాండ్ మీడియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః దక్షిణ్ శ్రీనివాస్, కో ప్రొడ్యూసర్ః వి.చంద్రశేఖర్, నిర్మాతః డి.వి.కృష్ణస్వామి, దర్శకత్వంః సమీర్ తాహిర్.


Click it and Unblock the Notifications











