కనీసం ఎప్పుడూ కలవలేదు కానీ.. ఇర్ఫాన్ మృతిపై సాయి పల్లవి ఎమోషనల్
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కోలన్ ఇన్ఫెక్షన్ (పెద్ద పేగుకు సంబంధించిన వ్యాధి)తో నేడు మరణించిన సంగతి తెలిసిందే. ఇర్ఫాన్ మృతి పట్ల యావత్ భారత సినీలోకం దు:ఖ సాగరంలో మునిగింది. బాలీవుడ్ సెలెబ్రిటీలే కాకుండా అన్ని భాషల నటీనటులు ఇర్ఫాన్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఇర్ఫాన్ మరణ వార్త క్షణాల్లో వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఇర్ఫాన్ మృతికి నెటిజన్స్ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్, అక్షయ్ కుమార్, ఆమీర్ ఖాన్, అజయ్ దేవగణ్ వంటి స్టార్స్ అంతా సంతాపాన్ని తెలియజేశారు. మోహన్ లాల్, మహేష్ బాబు వంటి ఇతర రాష్ట్రాల హీరోలు కూడా ఇర్ఫాన్ మరణం పట్ల దు:ఖిస్తున్నారు. ప్రణీత, హన్సిక, రకుల్, పరిణితీ, శ్రుతీ హాసన్ వంటి కథానాయికలు కూడా ఇర్ఫాన్ ఖాన్ మృతిపై స్పందించారు.

తాజాగా సాయి పల్లవి సైతం స్పందిస్తూ ఎమోషనల్ అయింది. 'కనీసం మిమ్మల్ని చూడనేలేదు.. కానీ మీ మరణం నన్నెంతో బాధిస్తోంది.. కళ పట్ల మీకున్న అంకితభావం, ప్రేమ, కష్టపడేతత్వం మా హృదయాలకు దగ్గర చేసింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి' అంటూ ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











