మరో వివాదంలో సాయి పల్లవి.. శర్వానంద్‌తో గొడవపై క్లారిటీ

By Rajababu

Recommended Video

Sai Pallavi Again Haves Gossips On Her Behaviour

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న హీరోయిన్ సాయిపల్లవి. ఇటీవల చిత్రాల్లో ఆమె నటనకు, డ్యాన్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతిభకు తగినట్టే ప్రశంసలు అందుకొంటున్న సాయిపల్లవి చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా టాలీవుడ్‌లో పలువురు హీరోలతో షూటింగ్ సందర్భంగా విభేదాలు చోటుచేసుకొన్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా పడిపడి లేచే మనుసు చిత్రంలో హీరో శర్వానంద్‌తో విభేదాలు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై సాయి పల్లవి వివరణ ఇచ్చారు. అసలేం జరిగిందంటే...

 శర్వానంద్‌తో విభేదాలపై

శర్వానంద్‌తో విభేదాలపై

సాయిపల్లవి, శర్వానంద్ మధ్య విభేదాలు తలెత్తాయనే వార్త టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వీరిద్దరి గొడవ కారణంగా షూటింగ్‌కు అంతరాయం కలిగింది అని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే శర్వానంద్‌తో విభేదాల వార్తను సాయిపల్లవి కొట్టిపడేశారు. ఆ కథనాల్లో పేర్కొనదంతా అవాస్తవమే అని దానిపై వివరణ ఇచ్చారు.

 మరో చిత్రంలో నటించే విషయమై

మరో చిత్రంలో నటించే విషయమై

ప్రస్తుతం శర్వానంద్‌ పడిపడి లేచే మనసు చిత్రంతోపాటు మరోచిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఆ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉన్నందున బ్రేక్ ఇచ్చారు. అంతేకానీ శర్వానంద్, తనకు ఎలాంటి గొడవలు లేవని సాయిపల్లవి క్లారిటీ ఇచ్చారు. సెన్సిబుల్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పడి పడి లేచే మనసు డిసెంబర్‌ 21న రిలీజ్ కానుంది.

నానితో గొడవ పడినట్టు

నానితో గొడవ పడినట్టు

గతంలో ఎంసీఏ చిత్ర షూటింగ్ సందర్భంగా నానితో గొడవపడినట్టు వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆ చిత్ర ప్రమోషన్ సందర్బంగా నాని వివరణ ఇస్తూ తనకు సాయిపల్లవికి మధ్య ఎలాంటి గొడవలు లేవు. మీడియాలో వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలే అని అప్పట్లో నాని వివాదానికి పుల్‌స్టాప్ పెట్టారు.

సాయిపల్లవిపై నాగశౌర్య ఆరోపణలు

సాయిపల్లవిపై నాగశౌర్య ఆరోపణలు

ఇక తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన కణం చిత్రం సందర్భంగా ఇలాంటి వార్తలే వచ్చాయి. గాలివార్తగా కాకుండా ఏకంగా సాయిపల్లవిపై నాగశౌర్య ఆరోపణలు చేయడం సంచలనం రేపాయి. సాయిపల్లవి తలబిరుసుగా వ్యవహరిస్తుంది. ఆమె కంటే అందమైన హీరోయిన్లతో నటించాను. ఆ ప్రవర్తన నాకు నచ్చలేదు అని నాగశౌర్య టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

నాగశౌర్య విభేదాల గురించి

నాగశౌర్య విభేదాల గురించి

నాగశౌర్య ఆరోపణలపై కూడా సాయిపల్లవి స్పందించారు. కణం సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. షూటింగ్‌లో నేను ఎక్కువగా మాట్లాడను. సీన్ గురించే ఆలోచిస్తాను. పక్కన ఎవరు ఉన్నారనే విషయాన్ని కొన్నిసార్లు మరిచిపోతాను. అందువల్ల నాగశౌర్య ఇబ్బంది పడితే అందుకు క్షమాపణ చెబుతున్నాను అని సాయిపల్లవి వివరణ ఇచ్చారు.

సూర్యతో రెండు చిత్రాల్లో

సూర్యతో రెండు చిత్రాల్లో

ప్రస్తుతం తమిళంలో సూర్యతో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఎన్‌జీకే (నంద గోపాలకృష్ణ) చిత్రంతోపాటు మారి2 చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. వాటితోపాటు నీది నాదీ ఒకే కథ చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల తదుపరి చిత్రంలో నటించేందుకు సాయిపల్లవి అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X