twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడు చాలా టెన్షన్ పడ్డా.. హనీ చేయవద్దు.. సాయి పల్లవి

    By Rajababu
    |

    Recommended Video

    Sai Pallavi said we should not make threat to nature.

    మలయాళ చిత్రం ప్రేమమ్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకొన్న సాయి పల్లవి ఫిదా చిత్రంతో దుమ్ము దులిపేసింది. ఫిదా చిత్రంలో ఆమె నటన, డాన్స్‌లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటిస్టున్న సాయి పల్లవి ఇటీవల మీడియాతో మాట్లాడారు. గత చిత్రాల షూటింగ్‌లో అనుభూతులను పంచుకొన్నారు. సాయి పల్లవి చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

     ప్రకృతి అంటే ప్రాణం

    ప్రకృతి అంటే ప్రాణం

    నాకు ప్రకృతి అంటే ప్రాణం. సహజంగా ఉండటం అంటే మరీ ఇష్టం. వానలో తడవడం, ఇంధ్రధనస్సును చూడటమంటే చాలా ఇష్టం. మనసులో ఎలాంటి టెన్షన్లు పెట్టుకోకుండా ఉంటాను. సీతాకోక చిలుకలా ఎగురాలనుకొంటాను అని సాయి పల్లవి చెప్పింది.

     సీతాకోక చిలుకలతో

    సీతాకోక చిలుకలతో

    ప్రేమమ్ చిత్ర షూటింగ్ సందర్భంగా నాకు ఇష్టమైన సీతాకోక చిలుకల మధ్య ఓ షాట్ తీశారు. స్క్రిప్టులో ముందస్తు ప్లాన్ లేదు. కానీ షూటింగ్ చేస్తుంటే సీతాకోక చిలుకల గుంపు అక్కడి వచ్చింది. వాటి కోసం నేను పరిగెత్తుకెళ్లి పట్టుకొంటే ఆ సీన్‌ను కెమెరామెన్ షూట్ చేశాడు.

     హాని చెయ్యకూడదు

    హాని చెయ్యకూడదు

    అప్పుడు డైరెక్టర్ నా గుప్పిట్లో సీతాకోకచిలుకను ఉంచారు. నా గుప్పిట్లో గట్టిగా మూస్తే దానికి ఎక్కడ ఉపిరి ఆడదోనని భయపడ్డాను. ఆ కొన్ని క్షణాలు నేను పడ్డ టెన్షన్‌ అంతా ఇంతా కాదు. అలాంటి సీన్లు ఇంకెప్పుడూ నాతో చేయించవద్దని డైరక్టర్‌ని కోరాను. ప్రకృతిని, అందులోని జీవరాశులను చూసి మనం ఆస్వాదించాలే తప్ప, వాటికి హాని చెయ్యకూడదు'' అని చెప్పారు సాయిపల్లవి.

     ఎంసీఏ చిత్రంలో నానీతో

    ఎంసీఏ చిత్రంలో నానీతో

    ఫిదా తర్వాత ప్రస్తుతం సాయి పల్లవి నటిస్తున్న చిత్రం ఎంసీఏ. ఈ చిత్రంలో సాయి పల్లవికి జోడిగా నానీ నటిస్తున్నాడు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. త్వరలోనే ఫస్ట్‌లుక్, టీజర్లు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    Premam fame Sai Pallavi is doing a MCA movie with Nani. After Fidaa super Hit, lot of expections on Sai Pallavi. Sai Pallavi said she loves nature and butterflies a lot. She said.. we should not make threat to nature.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X