Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సాయి పల్లవి, నాగ చైతన్యల 'లవ్ స్టొరీ'.. టీజర్ వచ్చేది ఎప్పుడంటే?
ఫిదా సినిమాతో అలా ఎంట్రీ ఇచ్చిందో లేదో సాయి పల్లవి తెలుగు జనాలకు బాగా దగ్గరైంది. ఈ హై బ్రీడ్ పిల్ల సినిమాలకు ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. దానికి తోడు మంచి కాంబినేషన్ ఉన్న దర్శకుడు హీరో సెట్టయితే చెప్పేదేముంది. బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లు దక్కడం కామన్.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టొరీ సినిమాలో నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక సినిమాకి సంబంధించిన షూటింగ్ చివరి దశలో ఉంది. హైదరాబాద్ లోనే లాస్ట్ షెడ్యూల్ ని ఫినిష్ చేయనున్నారు. ఇక సినిమా టీజర్ ని నాగచైతన్య బర్త్ డే సందర్భంగా సినిమా టీజర్ ని విడుదల చేయనున్నారు.
గతంలో సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ స్పెషల్ పోస్టర్స్ అలాగే సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు టీజర్ తో సినిమాపై అంచనాల డోస్ ని మరింత పెంచాలని దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాను ఎలాగైనా థియేటర్స్ లోనే రిలీజ్ చేయనున్నట్లు మరోసారి చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.
ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు గతంలో కొన్ని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ చిత్ర యూనిట్ మాత్రం అలాంటి ఆలోచనలో లేనట్లు మరోసారి క్లారిటీ ఇచ్చింది. కరోనా పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాతనే రిలీజ్ డేట్ గురించి ఆలోచించాలని చిత్ర నిర్మాతలు ఒక ప్లాన్ సెట్ చేసుకున్నట్లు సమాచారం.