సాయి పల్లవి ఫోన్ నెంబర్ లీక్? అడ్డంగా బుక్కయ్యిపోయిన యువకుడు!

ఇపుడు సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్న అందరు హీరోయిన్స్ ఒకెత్తు అయితే ఒక్క నాచురల్ బ్యూటీ సాయి పల్లవి మరో ఎత్తు అని చెప్పాలి. ఇతర హీరోయిన్స్ లో చాలా వరకు గ్లామరస్ వరకే కనిపిస్తూ ఉంటారు. ఇంకా పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ అయితే ఆ ఊసే చాలా మంది విషయంలో కనిపించదు. కానీ అందుకు భిన్నంగా పెర్ఫామెన్స్ తోనే చితక్కొట్టే హీరోయిన్ గా సాయి పల్లవి ఇపుడు దొరికింది.

ఇంకా కొన్ని సినిమాలు అయితే ఆమె బ్రాండ్ తోనే మంచి అటెన్షన్ ని కూడా అందుకునే పరిస్థితి ఇపుడు కనిపిస్తుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. కాగా ఇలా సాయి పల్లవి తెలుగు రాష్ట్రాలు సహా సౌత్ సినిమా దగ్గర కూడా తనదైన ముద్ర వేసుకుంది. కాగా సాయి పల్లవికి ఉన్న క్రేజ్ కానీ సినిమాల పరంగా ఆఫ్ లైన్ లో కనిపించే ఫాలోయింగ్ కానీ అంతా ఇంతా కాదు దీనితో ఈమె విషయంలో ఏ చిన్న అంశం అయినా బాగా వైరల్ అవుతుంది.

sai pallavi number got leaked a youngster got booked

అలా ఈ మధ్య సాయి పల్లవి చేసిన పలు కామెంట్స్ అది కూడా ఎప్పుడో చేసినవి ఇపుడు ఊహించని కాంట్రవర్సీకి దారి తీశాయి కానీ అవి తర్వాత సెటిల్ అయ్యిపోయాయి. ఇక ఇవి కొనసాగుతున్న క్రమంలోనే సాయి పల్లవి నటించిన సినిమా "అమరన్" థియేటర్స్ లోకి వచ్చింది. అయితే ఈ సినిమా తోనే సాయి పల్లవి మొబైల్ నెంబర్ లీక్ కావడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి సినిమా సెలెబ్స్ ఫోన్ నెంబర్ లాంటివి దొరికితే బాగుండు అని చాలా మందిలో కుతూహలం ఉంటుంది. కానీ అవి తేలికైన విషయాలు కాదు కానీ వారు సినిమాల్లో చూపించే నంబర్స్ మాత్రం పెద్ద తలనొప్పే తీసుకొస్తాయి. కాగా అలానే ఇపుడు అయి పల్లవి నెంబర్ చూసి ఓ యువకుడు బుక్కయ్యిపోయాడు అట.

sai pallavi number got leaked a youngster got booked

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే అమరన్ సినిమాలో సాయి పల్లవి శివకార్తికేయన్ కి తన ఫోన్ నెంబర్ ని ఒక పేపర్ పై ఇచ్చే సన్నివేశం ఉంటుంది. అందులో క్లియర్ గా అన్ని నంబర్స్ కనిపిస్తాయి. ఇక ఏముంది సినిమా చూసిన ఆడియెన్స్ ఆయా నంబర్స్ కి కాల్ చెయ్యడం స్టార్ట్ చేశారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే పాపం ఆ నెంబర్ తమిళనాడుకి చెందిన ఎవరో యువకుడిది అట.

ఆ సినిమా దెబ్బకి తనకి నాన్ స్టాప్ గా కాల్స్ రావడం మొదలయ్యింది. దీనితో అతడు విసిగి వేసారిగిపోయేసరికి అసలు మేటర్ బయటకి వచ్చింది. ఇలా సాయి పల్లవి ఇచ్చిన నెంబర్ అయితే ఇంత పని చేసింది అని చెప్పాలి. మరి సినిమా పరంగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం ఇదే మొదటిసారి కాదని చెప్పాలి. గతంలో కూడా పలు సినిమాల్లో ఇలా నంబర్స్ కనిపిస్తే ఈ తరహాలోనే జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పట్లో కింగ్ నాగార్జున నటించిన "శివమణి" సినిమా సమయంలో కూడా ఈ తరహాలోనే జరిగినట్టుగా టాక్ కూడా ఉంది.

More from Filmibeat

Read more about: sai pallavi amaran thandel
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X