మెగాస్టార్ చిరంజీవి ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన యంగ్ హీరోయిన్.. కారణం ఏమిటంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అంటే లెజెండ్. దాదాపు 150 పైగా చిత్రాల్లో నటించారు. అయితే ఆయన పక్కన ఎంతో మంది హీరోయిన్లు నటించారు. అగ్రస్థాయికి చేరుకొన్నారు. అయితే ఆయన పక్కన నటించాలని చాలా మంది యంగ్ హీరోయిన్లు ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఆయన పక్కన నటించే ఆఫర్, అవకాశం వస్తే ఎవరు కాదనుకొంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం మెగాస్టార్ ఆఫర్‌ను తిరస్కరించారు. ఆ వివరాల్లోకి వెళితే..
మెగాస్టార్ చిరంజీవితో నటించి స్టెప్పులేయలంటే.. సత్తా ఉండాల్సిందే. రాధిక, మాధవి, రాధ, సుహసిని నుంచి సొనాలి బింద్రే వరకు.. నేటి కాజల్ వరకు ఆయనతో నటించి మెప్పించారు. ఇప్పటికీ చిరంజీవితో నటించాలని తహతహలాడుతుంటారు. నేటికి కుర్ర హీరోయిన్లతో ఆయన స్టెప్పులు వేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు.

అలాంటి మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించాలని ఓ ప్రతిభావంతురాలైన యంగ్ హీరోయిన్ సాయిపల్లవిని సంప్రదించారు. అయితే ఆమె ఆయనతో నటించలేనని సున్నితంగా తిరస్కరించారు. దాంతో ఆ చిత్ర యూనిట్ షాక్ గురైంది. ఆ విషయం చిరంజీవికి చెబితే ఆయన స్పోర్టివ్‌గా తీసుకొన్నారు.
ఇక నేరుగా సాయిపల్లవిని చిరంజీవి మాట్లాడి.. ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు. దాంతో ఆమె మరోసారి ఆఫర్‌ను తిరస్కరించింది. తాను మీకు చెల్లెలి పాత్రలో నటించలేను. మీ పక్కన హీరోయిన్‌గా నటించాలి. డ్యాన్సులు, స్టెప్పులు వేయాలనే కోరిక ఉంది. అందుకే నేను రిజెక్ట్ చేశాను అని సాయిపల్లవి వెల్లడించిందంట.

సాయిపల్లవికి రోల్ ఆఫర్ చేసిన విషయాన్ని స్వయంగా లవ్ స్టోరీ సినిమా ఫంక్షన్‌లో చిరంజీవి స్వయంగా చెప్పారు. ఆ వేదికపై తన వెర్షన్‌ను క్లారిటీతో చెప్పింది. చెల్లెలి పాత్రను ఆమె వదులుకోవడంతో ఆ రోల్ కీర్తిసురేష్‌కు దక్కింది. ఆ సినిమానే భోళాశంకర్. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











