Love Story release date: సాయి పల్లవి, చైతూ ప్రేమ కథ థియేటర్లలోనే.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

టాలీవుడ్‌లో అత్యధిక మంది సినీ అభిమానులు ఎదురు చూస్తున్న చిత్రం లవ్ స్టోరి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి, నాగచైతన్య నటించిన ఈ చిత్రం రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను, క్రేజ్‌ను సొంతం చేసుకొన్నది. అయితే ఈ ఏడాది ఆరంభంలో రిలీజ్ చేయాలని నిర్మాతలు, దర్శకుడు శేఖర్ కమ్ములు ప్లాన్ చేశారు. అయితే సెకండ్ వేవ్ ప్రారంభ కావడంతో చిత్ర యూనిట్ ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలని నిర్ణయించారు.

లవ్ స్టోరి సినిమా వాయిదా పడినా.. ఆ చిత్రంలోని సారంగ ధరియా పాట మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేసింది. సాయిపల్లవిపై చిత్రీకరించిన పాట రిలీజైన కొద్ద రోజుల్లోనే 300 మిలియన్ల వ్యూస్‌ను సాధించి ఇంకా భారీగా వ్యూస్ సొంతం చేసుకొంటున్నది. ఈ పాట యూట్యూబ్, సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతున్నది. దీంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది. కేవలం సారంగ ధరియా పాటనే కాకుండా హేయ్ పిల్ల, నీ చిత్రం చూసి పాటలు కూడా సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఈ పాటలకు కూడా మిలియన్ వ్యూస్ రావడం గమనార్హం.

Sai Pallavis Love story to hit Theatres on September 10

అయితే సాయిపల్లవి, నాగచైతన్య క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన లవ్ స్టోరీ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతున్నదనే రూమర్లు భారీగా క్రియేట్ అయ్యాయి. అయితే ఆ రూమర్లను, ఊహాగానాలను నిర్మాత, దర్శకులు ఖండించారు.

తాజాగా చిత్ర నిర్మాతలు లవ్ స్టోరి సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. లవ్ స్టోరి మూవీ వినాయక చవితి పండుగ సందర్భంగా థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను సెప్టెంబర్ 10వ తేదీన గ్రాండ్‌గా సినిమా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం అంటూ చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో వచ్చే వినాయక చవితికి థియేటర్లలో లవ్ స్టోరి హల్‌చల్ చేయడం ఖాయమనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: సాయిపల్లవి, నాగచైతన్య, రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని, ఆనంద చక్రపాణి తదితరులు
కథ, దర్శకత్వం: శేఖర్ కమ్ముల
నిర్మాతలు: కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఐర్ల నాగేశ్వర్ రావు
కో ప్రొడ్యూసర్: భాస్కర్ కాటమశెట్టి
సినిమాటోగ్రఫి: విజయ్ సీ కుమార్
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
మ్యూజిక్: పవన్ సీహెచ్
రిలీజ్ డేట్: 2021-09-10

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X