సాయి పల్లవి అరాచకం.. అల్లు అర్జున్, విజయ్‌ల కంటే హై రేంజ్‌లో న్యూ రికార్డ్
సినిమా హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ గా కనిపిస్తే సరిపోదు. అంతకంటే ఎక్కువగా టాలెంట్ ఉండాలి. హీరోలకు ఏ మాత్రం తీసిపోని డ్యాన్స్ స్కిల్స్ ఉంటే మరో బోనస్ అనే చెప్పాలి. ఇక ఆ లిస్ట్ లో ఉన్న సాయి పల్లవి సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. అగ్ర హీరోలు అందుకున్న రికార్డులను చాలా సింపుల్ గా బ్రేక్ చేస్తోంది. రీసెంట్ గా అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రికార్డులను కూడా బ్రేక్ చేసేసింది.

సాయి పల్లవిపై ఒక నమ్మకం
సాయి పల్లవి ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది అంటే తప్పకుండా సినిమాలో ఎదో ఒక కొత్త పాయింట్ ఉంటుందని చెప్పవచ్చు. ఆమె కథల సెలక్షన్ పై అభిమానుల్లో ఒక నమ్మకమైతే పెరిగింది. సాయి పల్లవి సినిమాలు క్లిక్కయితే బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తాయని చెప్పవచ్చు.

వెన్నతో పెట్టిన విద్య..
సినిమాలు ఎలా ఉన్నా కూడా ముందుగా సాయి పల్లవి క్రేజ్ తోనే సగం బజ్ పెరిగినట్లే. వీలైనంత వరకు సినిమా జనాలకు కనెక్ట్ అయ్యేలా చేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఇక లవ్ స్టొరీ సినిమా వెనుక ఎంతమంది ఉన్నా కూడా సాయి పల్లవి ఆ సినిమాలో ఉండడం వలన అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

టాప్ 1లో సారంగదరియా..
ఇటీవల వచ్చిన సారంగదరియా పాట యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డును అందుకుంది. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యదిక వేగంగా(18రోజుల్లో) 100 మిలియన్ వ్యూవ్స్ అందుకున్న పాటగా సారంగదరియా టాప్ 1 లో నిలిచింది. సౌత్ ఇండియా మొత్తంలో చూసుకుంటే రౌడి బేబి మొదటి స్థానంలో ఉంది.

స్టార్ హీరోల కంటే వేగంగా
ఇక సాయి పల్లవి.. అల్లు అర్జున్, విజయ్ వంటి స్టార్స్ ను కూడా వెనక్కి నెట్టివేసింది. బుట్టబొమ్మ పాటకు 100 మిలియన్ వ్యూవ్స్ అందుకోవడానికి 40రోజులు పట్టింది. ఇక విజయ్ మాస్టర్ సాంగ్ వాథి కమింగ్ కు 54రోజులు పట్టింది. అత్యదిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ స్టార్ హీరోల కంటే కూడా సాయి పల్లవి మొదటి స్థానంలో నిలిచి మరోసారి తన టాలెంట్ ఏమిటో నిరూపించుకుంది.


Click it and Unblock the Notifications











