For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్కూల్‌లో అల్లు అర్జున్ పాటలకు డాన్స్.. హీరోయిన్లు అంతా శర్వానంద్ గురించి.. సాయి పల్లవి!

    |

    అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాధ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి దర్శత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ పడి పడి లేచే మనసు. రొమాంటిక్ లవ్ స్టోరీ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి పల్లవి, శర్వానంద్ జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదుల కానుండడంతో సోమవారం రోజు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగింది. ఫిదా చిత్రంతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన సాయి పల్లవి ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన ఎనర్జిటిక్ స్పీచ్ తో ఆకట్టుకుంది.

    అల్లు అర్జున్ పాటలకు డాన్స్

    అల్లు అర్జున్ పాటలకు డాన్స్

    సాయి పల్లవి ప్రసంగం ప్రారంభించగానే అభిమానులు పెద్ద ఎత్తున హర్షద్వానాలు తెలియజేశారు. మరోమారు సాయిపల్లవిక్రేజ్ బయట పడింది. సాయి పలలవి మాట్లాడుతూ.. చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన అల్లు అర్జున్ కు కృతజ్ఞతలు తెలిపింది. నేను మీకు పెద్ద అభిమానిని. మీ పాటలకు స్కూల్ లో ఎన్ని సార్లు డాన్స్ చేసి ఉంటానో ఊహించలేరు అని తెలిపింది. మిమ్మల్ని ఇలా కలుసుకోవడంతో నా కల నెరవేరింది అని సాయి పల్లవి అల్లు అర్జున్ ని ఉద్దేశించి మాట్లాడింది.

     హీరోయిన్లు అంతా

    హీరోయిన్లు అంతా

    శర్వానంద్ గురించి మాట్లాడుతూ అతడిని ప్రశంసలతో ముంచెత్తింది. శర్వానంద్ గురించి చాలా మంది హీరోయిన్లు మంచిగా చెప్పారు. అది నిజం. శర్వానంద్ బెస్ట్ కోస్టార్ అంటూ కితాబిచ్చింది. దర్శకుడు హను రాఘవపూడికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. నన్ను నమ్మి ఈ చిత్రంలో వైశాలిగా నటింపజేశారు అని తెలిపింది. ఏ చిత్రం మరో అద్భుతమైన పాత్రలో నటించే అవకాశం దొరికిందని సాయి పల్లవి పేర్కొంది.

    చిత్ర యూనిట్ గురించి

    చిత్ర యూనిట్ గురించి

    ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు సాయి పల్లవి కృతజ్ఞతలు తెలియజేసింది. డబ్బు కోసం కాకుండా నిర్మాత సుధాకర్ ఈ చిత్రానికి ఫ్యాషన్ తో పనిచేశారు. ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ జేకే మంచి విజువల్స్ అందించారు. మేమంతా 8 నెలలనుంచి ఎంతో కష్టపడి ఈ చిత్రం కోసం పనిచేశాం అని సాయిపల్లవి పేర్కొంది. అభిమానులని ఉద్దేశించి మాట్లాడుతూ మీరిస్తున్న ప్రోత్సాహంతోనే ఇంకా మంచి పాత్రలు చేయాలనే పట్టుదల పెరుగుతోందని సాయి పల్లవి పేర్కొంది.

    సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా

    సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున పడి పడి లేచే మనసు ప్రీరిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు కావడంతో సందడి నెలకొంది. చిత్ర యూనిట్ కి, శర్వానంద్, సాయి పల్లవికి బన్నీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. సాయి పల్లవితో సినిమాకంటే.. ఓ సాంగ్ ఎప్పుడెప్పుడు చేస్తానా అని ఎదురుచూస్తున్నట్లు బన్నీతెలిపాడు. ఆమె మంచి నటి అందులో సందేహం లేదు. అంతకంటే అద్భుతమైన డాన్సర్ ఆమె అని బన్నీ తెలిపాడు. ఫిదా చిత్రంలో వచ్చిండే పాటని ఎన్ని సార్లు చూసానో నాకే గుర్తులేదు అని బన్నీ తెలిపాడు.

    English summary
    Sai Pallavi Speech At Padi Padi Leche Manasu Pre Release Event. Hanu Raghavapudi directing this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X