సమంతకు సాయిపల్లవి ఛాలెంజ్.. రానాను కూడా ఇన్వాల్వ్ చేసింది

ప్రస్తుతం నెట్టింట గ్రీన్ ఛాలెంజ్ హవా నడుస్తోంది. పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటాలనే సదుద్దేశంతో నడుస్తున్న ఈ ఛాలెంజ్‌ని పలువురు సెలెబ్రిటీలు సాదరంగా స్వాగతిస్తున్నారు. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ రోజు రోజుకూ విస్తరిస్తూ వచ్చి సాయిపల్లవి వద్దకు చేరింది.

ఇప్పటికే గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా అక్కినేని అఖిల్, కవిత, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొక్కలు నాటారు. అయితే మొక్కలు నాటిన వరుణ్ తేజ్ తన సవాల్ సాయి పల్లవికి హరిత సవాల్ విసిరారు. తాజాగా ఆ సవాల్ స్వీకరించిన సాయిపల్లవి తన ఇంటి ప్రాంగణంలో మొక్కలు నాటింది. ఈ పిక్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సమంత అక్కినేని, రానా దగ్గుబాటి లను నామినేట్ చేసింది. ఈ మేరకు తనకు ఛాలెంజ్ విసిరిన గద్దలకొండ గణేష్‌కి ధన్యవాదాలు తెలుపుతూ సమంత అక్కినేని, రానా దగ్గుబాటి లను మొక్కలు నాటాలని తెలిపింది. మొక్కల ప్రాధాన్యతను తన పోస్ట్ ద్వారా వివరించింది సాయి పల్లవి.

Sai Pallavi takes Green India Challenge and nominates Samantha, RanaDaggubati

తెలంగాణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని మొదటగా రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ మొదట ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొక్కలు నాటిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సెప్టెంబరు 5న వనమిత్ర అవార్డ్‌ను ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి ఈ కార్యక్రమంలో భాగమైన వారందరికీ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

ఇక సాయి పల్లవి సినిమాల విషయానికొస్తే.. వరుణ్ తేజ్ సరసన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసి భారీ పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తరువాత నాని సరసన ఎంసీఏ సినిమాలో నటించి భేష్ అనిపించుకుంది. ఆ వెంటనే పడి పడి లేచే మనసు సినిమాలో నటించినప్పటికీ పెద్దగా ఫలితం లేదు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమాలో సాయి పల్లవి నటిస్తోంది. ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X