ఏనుగుల దాడి నుంచి తప్పించుకొన్న సాయిపల్లవి.. రానా జస్ట్ మిస్!
యువ దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో సాయి పల్లవి, రానా దగ్గుబాటి జంటగా నటిస్తున్న విరాటపర్వం షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇంకా పది రోజుల షూటింగ్ మిగిలి ఉందని, లాక్‌డౌన్ కారణంగా ఆ పార్ట్ ఆగిపోయిందని యూనిట్ వెల్లడించింది. నక్సలైట్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ 50 శాతానికిపైగా వికారాబాద్, వరంగల్, కేరళ అడవుల్లోనే జరిగింది. ఈ సందర్భంగా కేరళలో జరిగిన ఓ ప్రమాదం నుంచి సాయిపల్లవి, దర్శకుడు వేణు ఊడుగుల తప్పించుకొన్న విషయం చర్చనీయాంశమైంది. ఆ ప్రమాద వివరాలను యూనిట్ సంబంధించిన సభ్యులు వెల్లడిస్తూ..

ఏనుగుల మంద ఘీంకారం చేస్తూ
లాక్‌డౌన్‌కు ముందు చాలా రోజులు కేరళలోని అడవుల్లో షూట్ చేశాం. ఓ రోజు షూటింగ్ పూర్తి చేసుకొని అందరూ తమ వస్తువులు, బ్యాగులు ప్యాక్ చేసుకొంటుండగా ఘీంకారం చేస్తూ వచ్చిన ఏనుగుల మందను చూశాం. చూస్తుండగానే 20పైగా ఏనుగులు మాపైకి దూసుకొచ్చాయి అని యూనిట్ సభ్యుడు చెప్పారు.

ఏనుగులను చూసి పరుగులు
ఆవేశంతో పరుగులు పెడుతున్న ఏనుగులను చూసి మేమంత మా వస్తువులను వదిలేసి పరుగులు పెట్టాం. వెనుకకు చూడకుండా దాదాపు కిలో మీటర్ వరకు పరుగులు పెట్టాం. ఏనుగుల శబ్దాలు ఆగిపోవడంతో మళ్లీ మెల్లగా వెనుకకు వెళ్లాం. ఆ తర్వాత మా కెమెరాలను, ఇతర ఎక్విప్‌మెంట్‌ను తీసుకొని వచ్చాం అని తెలిపారు.

రానా దగ్గుబాటి అప్పడే
ఏనుగుల దాడి జరిగినప్పుడు రానా దగ్గుబాటి లేరు. అప్పుడే ఆ ప్రదేశం నుంచి ఆయన వెళ్లిపోయారు. వెళ్లిన కొద్ది నిమిషాలకే ఈ సంఘటన జరిగింది. ఏనుగుల మంద దాడి చేసినప్పుడు సాయి పల్లవి, దర్శకుడు వేణు ఊడుగుల ఇతర యూనిట్ సభ్యులు మాత్రమే ఉన్నారు. ఆ సంఘటనను తలచుకొంటే ప్రాణం పోయినంత పని అవుతుందని యూనిట్ సభ్యుడు వెల్లడించారు.
Recommended Video

సాయిపల్లవితో కూడిన ఫస్ట్ లుక్‌కు
ఇటీవల సాయిపల్లవి జన్మదినం సందర్భంగా రిలీజ్ చేసిన విరాట పర్వం పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. సాయిపల్లవి చాలా సాదాసీదా పల్లెటూరి అమ్మాయిలా కనిపించిన తీరు పోస్టర్‌లో హైలెట్‌గా మారింది. ఇక లాక్‌డౌన్ కంటే ముందే ఎడిటింగ్ పార్టును పూర్తి చేశాం. సినిమా అవుట్ పుట్ చూసిన వారంతా అద్భుతంగా వచ్చిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











