Sai Pallavi: సాయి పల్లవి ఖాతాలో మరో అరుదైన ఘనత..

Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం చేయనక్కర్లేదు. ఇండస్ట్రీ లోకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగింది. తన అందం, అభినయంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నది. అంతేకాకుండా తన డ్యాన్స్ తో ఎంతోమందినీ మెస్మరైజ్ చేస్తోంది ఈ నేచురల్ బ్యూటీ . ఫిదా మూవీ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుస విజయాలను అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. అయితే ఈ అమ్మడు ఖాతాలో మరో అరుదైన అవార్డు వచ్చి చేరింది. ఇంతకీ ఆ అవార్డు ఏంటో మీరు కూడా ఓ లూక్కేయండి.

తమిళ చిత్ర పరిశ్రమ ప్రత్యేకంగా భావించే వేడుక చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. ఈ కార్యక్రమం గురువారం సాయంత్రం జరిగింది. ఇందులో కోలీవుడ్ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకలో 'అమరన్' సినిమాకు గానూ హీరోయిన్ సాయి పల్లవికి ఉత్తమ నటిగా అందుకుంది. ఈ అవార్డుతో తన ఖాతాలో మరో అదురైన ఘనత వచ్చి చేరింది. అలాగే.. 'మహారాజ' తో హీరోగా నచ్చిన విజయ్ సేతుపతికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.

Sai Pallavi won the Best Actress award for Amaran Vijay Sethupathi Best Actor Award IN 22nd Chennai International Film Festival

ఈ వేడుకల్లో ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతి (మహారాజా), ఉత్తమ నటి అవార్డు సాయి పల్లవి (అమరన్)కు లభించాయి. అలాగే.. ఉత్తమ చిత్రంగా 'అమరన్', ఉత్తమ సంగీత స్వరకర్తగా జివి ప్రకాష్ (అమరన్) ఎంపికయ్యారు. ఈ సందర్బంగా 'అమరన్‌' చిత్రానికి గానూ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న సాయి పల్లవి మాట్లాడుతూ .. 'నటుడు మంచి పాత్రలో నటించడం చాలా కష్టం, అమరన్ సినిమాలో రెబెక్కా వర్గీస్‌ పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామికి కృతజ్ఞతలు. అమరన్ లో నటించినందుకు తమిళ్‌, కేరళ, తెలుగు అభిమానుల నుంచి మంచి ఆదరణ వచ్చిందని అన్నారు.

అనంతరం 'మహారాజా' చిత్రానికి గానూ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ.. తనకు దక్కిన అవార్డును చిత్ర దర్శకుడు నిథిలన్‌కి అంకితం అందిస్తున్నాననీ, ఆ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మహారాజా సినిమాలో నటించిన వారందరికి ధన్యవాదాలు. దయచేసి 'విడుకులై-2' చూడమని పేర్కొన్నారు.

Sai Pallavi won the Best Actress award for Amaran Vijay Sethupathi Best Actor Award IN 22nd Chennai International Film Festival

అనంతరం 'అమరన్‌' చిత్రానికి గానూ ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకున్న దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి మాట్లాడుతూ.. ''చెన్నై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి చాలాసార్లు వచ్చానని తెలిపారు. ఈ అవార్డు అందుకోవడానికి కారణమైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఫెస్టివల్‌లో తనకు అవార్డు ఇచ్చిన కమల్‌హాసన్‌కి నా కృతజ్ఞతలు. చిత్రబృందం అందరికీ ధన్యవాదాలు. శివకార్తికేయన్‌కి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తనకు వచ్చిన ఈ అవార్డును మేజర్ ముకుంద్ వరదరాజన్ - రెబెకా వర్గీస్ కుటుంబానికి అంకితం చేస్తానని తెలిపారు.

More from Filmibeat

Read more about: vijay sethupathi sai pallavi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X