సాయిరామ్ శంకర్ కి ఇదీ బంపర్ ఆఫర్ అవుతుందా?
సాయిరామ్ శంకర్ ,సుహాసి జంటగా వీరూ క్రియేషన్స్, శ్రీసద్గురు సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన 'వాడే కావాలి' చిత్రం డిసెంబరు మొదటివారంలో విడుదలవుతుంది. ఎస్.వి.ఆర్. మీడియో ప్రై.లి. ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఆ సంస్థ సి.ఇ.ఓ. శోభారాణి ఈ సందర్భంగా మాట్లాడుతూ 'నవ్యమైన ప్రేమకథతో రూపొందుతున్న ఈ సినిమా సాయిరామ్ శంకర్‌కు 'బంపర్ ఆఫర్' తర్వాత మరో మంచి సినిమా అవుతుంది. మంచి కథ, కథనాలతో లవ్ ఫీల్‌తో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. సినిమాలో ప్రతి సన్నివేశం కొత్తగా వుండి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగిస్తుంది ' అన్నారు. నరేష్, వేణుమాధవ్, ఆలీ,చంద్రవాస్, కోట శంకరరావు, చిత్రం శ్రీను, రఘుబాబు, శ్రీనివాస్‌వర్మ, రవిప్రకాష్, పిట్ల రాజేష్ నటించిన ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్య శాస్త్రి, అభినవ శ్రీనివాస్, బాలాజీ మంగు, సంగీతం: ఆర్.పి.పట్నాయక్, ఫొటోగ్రఫీ: కళ్యాణ్ సమి, నిర్మాతలు: వీరేష్‌బాబు, రఘునాథ్ సోగి, సమర్పణ: ఎస్.వి.ఆర్. మీడియో ప్రై.లి. దర్శకత్వం: రాజేంద్ర దర్శన్.


Click it and Unblock the Notifications











