మా అన్నయ్య,తేజ మధ్య తేడా అదే : సాయిరాం శంకర్
పూరి జగన్నాథ్ తమ్ముడు... దర్శకత్వంపై అభిమానం, అవగాహన, ఆసక్తి ఉన్నాయి. కానీ తెరపైకి వచ్చి హీరోగా రాణిస్తున్నాడు. అతడే సాయిరామ్ శంకర్. 'బంపర్ ఆఫర్' సినిమాతో తొలి విజయం దక్కింది. అలాంటి మరో ఫలితం కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు తేజ సినిమా '1000 అబద్ధాలు' విడుదలకు సిద్ధమైంది. గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ''ఇక్కడ విజయాలే మాట్లాడతాయి. హిట్టు కొట్టిన తరవాత ఎవరేమన్నా చెల్లుతుంది. '1000 అబద్ధాలు' అలాంటి అవకాశం ఇస్తుందనే నమ్మకం ఉంది'' అంటున్నారాయన.
ఇక తేజ సెట్లో హీరో హీరోయిన్లను కొడతారని అంటుంటారు. మీరెన్ని దెబ్బలు తిన్నారు.. అన్న దానికి సమాధానం చెప్తూ... నేనూ ఈమాట విన్నా. కానీ సెట్లో అలాంటి విపత్తులేం జరగలేదు. నిజానికీ ఎవరూ ఆ అవకాశం ఆయనకు ఇవ్వలేదు. మా నుంచి ఏం కోరుకొంటారో అది అందిచ్చేశాం అన్నారు. అలాగే 'సాయిరామ్ శంకర్‌ని పెట్టుకోవద్దు' అని తేజకి చాలామంది సలహా ఇచ్చారట. నిజమేనా? అంటే... అందరికీ ఉన్నట్టు ఆయనకూ శ్రేయోభిలాషులు ఉంటారు కదండీ. ఆయన మంచి కోరి ఎవరు ఏదైనా చెప్పొచ్చు. కానీ ఏరికోరి నన్నే ఎంచుకొన్నందుకు ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. ఆయనతో పనిచేయాలని ఎప్పటినుంచో అనుకొంటున్నా. నేనే వెళ్లి 'సార్ మీతో ఓ సినిమా చేయాలని ఉంది' అని అడిగా. నా కోసం ఇరవై కథలు చెప్పారు. అందులో ఒకటి.. ఈ '1000 అబద్ధాలు' అని అన్నారు.
ఈ కథలో తనకు నచ్చిన పాయింట్ గురించి చెప్తూ... ఈ కథ తేజ నాకు చెప్పేముందు ఓ మాటన్నారు. 'ఇది నీ గత సినిమాలతో పోలిస్తే కచ్చితంగా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల్లో నీపై ఓ సింపతీ క్రియేట్ చేస్తుందీ పాత్ర' అని. షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పాడో అది నిజమవుతుందని నమ్మకం బలపడింది. ఈ కథలో ఓ చిన్న పెయిన్ ఉంటుంది. ఆ బాధే నాపై సింపతీని క్రియేట్ చేస్తుంది అన్నారు.


Click it and Unblock the Notifications












