సాయిరాం శంకర్ కొత్త మూవీ షురూ (ఫోటోస్)
సాయిరామ్ శంకర్ హీరోగా చైత్రమూవీ మేకర్స్ పతాకంపై శ్రీమతి అడ్డాల శ్రీలత సమర్పణలో అడ్డాల పెద్దిరాజు నిర్మాతగా పి.ఎస్.వాసుదేవ్ దర్శకత్వంలో 'జగదాంబ' అనే చిత్రం గురువారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత చంటి అడ్డాల క్లాప్ కొట్టగా...పూరి జగన్నాథ్ సతీమణి లావణ్య కెమెరా స్విచాన్ చేసారు. శ్రీకాంత్ అడ్డాల గౌరవ దర్శకత్వం వహించారు.
హీరో సాయిరాం శంకర్ మాట్లాడుతూ...ఈచిత్రంలో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. యాక్షన్, కెమెడీ, థ్రిల్లర్ అంశాలతో వినోదాత్మకంగా సినిమా ఉంటుంది. వాసుదేవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 'ఓ మై ఫ్రెండ్' సినిమా ఫేం రాహుల్ రాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వరలో హీరోయిన్, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వివరాలు తెలియజేస్తామని తెలిపారు.
స్లైడ్ షోలో ప్రారంభోత్సవ ఫోటోలు, మరిన్ని వివరాలు...

నిర్మాత అడ్డాల పెద్ది రాజు మాట్లాడుతూ...
నిర్మాతగా నా తొలి సినిమా. సెప్టెంబర్ 15 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. అక్టోబర్లో సెకండ్ షెడ్యూల్ ఉంటుంది. రెండు షెడ్యూల్స్ లో సినిమా పూర్తవుతుంది. ఇప్పటి వరకు సాయి రామ్ శంకర్ చేసిన సినిమాలకు భిన్నంగా ఉంటుంది. కొత్త హీరోయిన్ నటించబోతోంది. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తాం అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ...
అమాయకంగా ఉండే హీరో...అతనికి మరదలు అంటే చాలా ఇష్టం. సరదాగా సాగిపోయే అతని జీవితంలో కొన్ని సంఘటనల కారణంగా సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను అతను ఎలా పరిష్కరించుకున్నాడనేదే కథాంశం అని తెలిపారు.

నటీనటులు
ఈ చిత్రంలో కన్నడ కిషోర్, అభిమన్యు సింగ్, ఎమ్మెస్ నారాయణ, కృష్ణ భగవాన్, సత్యం రాజేష్, రవిప్రకాష్, తాగుబోతు రమేష్, షకలక శంకర్, కళ్లు కృష్ణారావు, కోవై సరళ, సురేఖావాణి, బేబి జనన్య నటిస్తున్నారు.

టెక్నీషియన్స్
ఈచిత్రానికి పాటలు: రెహమాన్, సంగీతం: రాహుల్ రాజ్, సినిమాటోగ్రపీ: జగదీష్ చీకటి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, డాన్స్: కృష్ణా రెడ్డి, సత్య, ప్రొడక్షన్ కంట్రోల్: శంకర్, ప్రొడక్షన్ మేనేజర్: అంగడి శంకర్, అసిస్టెంట్ డైరెక్టర్: మహ్మద్ ఉమ్మర్, కో డైరెక్టర్: గోలి వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు: అల్లూరి రామ్మోహనరావు, నిర్మాత: అడ్డాల పెద్ది రాజు, రచన, దర్శకత్వం: పి.ఎస్.వాసుదేవ్.


Click it and Unblock the Notifications











