‘బంపర్ ఆఫర్’కాంబినేషన్‌లో కొత్త చిత్రం ప్రారంభం
తొలి సన్నివేశానికి పూరి జగన్నాథ్ క్లాప్‌నిచ్చారు. కేశవరావు స్విచ్చాన్ చేశారు. హీరో ఆది పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సాయిరామ్ మాట్లాడుతూ ''బంపర్ ఆఫర్ తరవాత మరోసారి రవీంద్రతో పనిచేయడం ఆనందంగా ఉంది. వినోదాత్మకంగా సాగే ప్రేమకథ ఇది. కొత్త కథ, మంచి నిర్మాతలు దొరికారు. దర్శకుడు ఈ కథను ఎంతో ఇష్టపడి చేసుకున్నారు'' అన్నారు.
దర్శకుడు చిత్రం గురించి చెబుతూ ''కథ చెప్పగానే అందరికీ నచ్చింది. శ్రీదేవి, భూదేవి అనే ఇద్దరు భామలతో హీరో ఎలా ప్రేమాయణం సాగించాడో చూపిస్తున్నాం. మరో హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి ఉంది'' అన్నారు. తమిళ 'వేదం'లో నటించానని, తెలుగులో తనకిది తొలి చిత్రమని హీరోయిన్ తెలిపారు.
'' ఇదొక అందమైన వినోదాత్మక ప్రేమకథ. 'బంపర్ ఆఫర్' చేసిన సాయిరామ్‌శంకర్, జయరవీంద్ర కాంబినేషన్‌లో చాలా మంచి కథతో ఈ సినిమా చేస్తున్నాం. అన్నీ పక్కాగా కుదిరాయి. శనివారం నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. డిసెంబరులో సినిమాని విడుదల చేస్తాము'' అని నిర్మాత చెప్పారు. సమర్పణ: కె.వి.వి.సత్యనారాయణ.


Click it and Unblock the Notifications












