బంపర్ ఆఫర్ హీరోని 'వాడే కావాలి'అంటారా?
పూరీ జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా చేసిన బంపర్ ఆఫర్ చిత్రం మొత్తానికి ఫరవాలేదనిపించుకుంది.దాంతో సాయి అంతకు ముందు చేసిన చిత్రాలను రిలీజుకు ముందుకు పెడుతున్నారు. అందులో వాడే కావాలి చిత్రం ఒకటి. సాయిరామ్ శంకర్, సుహాసి జంటగా వీరూ క్రియేషన్స్, శ్రీసద్గురు సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఆ సంస్థ సి.ఇ.ఓ.శోభారాణి ఈ సందర్భంగా మాట్లాడుతూ 'వైవిధ్యమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమా సాయిరామ్ శంకర్ కు 'బంపర్ ఆఫర్' తర్వాత మరో మంచి సినిమా అవుతుంది. మంచి కథ, కథనాలతో లవ్ ఫీల్‌తో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. 40 రోజుల పాటు మలేషియాలో షూటింగ్ జరిగింది. ఆర్.పి.పట్నాయక్ స్వరపరిచిన ఆరు పాటలు చాలా హుషారుగా, యూత్‌ఫుల్‌గా ఉంటాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబరు ప్రథమార్థంలో చిత్రాన్ని విడుదల చేస్తాం' అన్నారు. ఇతర పాత్రల్లో నరేష్, వేణుమాధవ్, ఆలీ, చంద్రవాస్, కోట శంకరరావు, చిత్రం శ్రీను, రఘుబాబు, శ్రీనివాస్‌వర్మ, రవిప్రకాష్, పిట్ల రాజేష్ నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం రాజేంద్ర దర్శన్ చేసారు.


Click it and Unblock the Notifications











