మరో యమగోల ('యమహో యమః' ప్రివ్యూ)
హైదరాబాద్: పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ కి కెరీర్ ప్రారంభం నుంచీ బ్రేక్ ఇచ్చే ఒక్క చిత్రమూ పడలేదు. దాంతో ఈ సారి సోషియో పాంఠసీ అనే సేఫ్ జోన్ లోకి వెళ్ళి తన లక్ పరీక్షించుకుంటున్నాడు. యముడు ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రాలన్నీ హిట్ కావటంతో ఈ చిత్రమూ తనకు మంచి విజయం ఇస్తుందని నమ్ముతున్నాడు. ముఖ్యంగా శ్రీహరి ఈ చిత్రంలో యముడుగా చేయటం సినిమాకు ప్లస్ అవుతుందంటున్నారు. మరి కొద్ది సేపట్లే ఈ చిత్రంపై సాయిరామ్ పెట్టుకున్న నమ్మకం నిజం అవుతుందా కాదా అన్నది తేలుతుంది.
కథలో... బాలు (సాయిరామ్ శంకర్) ఏ పనీ పాటా లేకుండా తిరుగుతుంటాడు. యమధర్మరాజుకు పరమ భక్తుడు. ఈ భక్తి వెనక ఉన్న కారణాలు మాత్రం సస్పెన్స్. బాలు అమెరికా వెళతాడు. అక్కడ స్వప్న (పార్వతి మెల్టన్)తో ప్రేమలో పడతాడు. ఇంతలో యమధర్మరాజు (శ్రీహరి) అమెరికాలో అడుగుపెడతాడు. బాలు కారణంగా అమెరికాలో యమునికి విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ తరవాత ఏమైందో తెర మీదే చూడాలి..
దర్శకుడు మాట్లాడుతూ ''యముని పాత్రలో శ్రీహరి నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. వినోదం, విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు నచ్చుతాయి. యముణ్ని భక్తితో ఆరాధించే యువకుడిగా హీరో పాత్ర ఉంటుంది. ఆ చిత్రంలో సాయిరామ్ క్యారెక్టర్ గురించి దర్శకుడు జితేందర్.వై మాట్లాడుతూ... పొద్దున లేవగానే రామా.. కృష్ణా... అని తలచుకొనే భక్తుల్ని చూశాం. శివుడికీ, శ్రీ వెంకటేశ్వరస్వామికీ దండం పెట్టుకొనేవాళ్లనీ చూస్తుంటాం. కానీ ఓ యువకుడు మాత్రం నిత్యం యమనామ జపం చేస్తుంటాడు. యమధర్మరాజుకి అపరభక్తుడిగా మారిన ఆ యువకుడి కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు. అలాగే... ఒక యమభక్తుడు సృష్టించే సందడితో ఆద్యంతం సరదాగా సాగే చిత్రమిది. యమధర్మరాజు అమెరికా వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చిందనే విషయాన్ని తెరపైనే చూడాలి. వినోదం, భావోద్వేగాల మేళవింపుతో కథ సాగుతుంది. యమధర్మరాజుగా శ్రీహరి నటన ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది'' అన్నారు.
సంస్థ: జి.వి.కె.ఆర్ట్స్.
నటీనటులు: శ్రీహరి, సాయిరామ్‌శంకర్, పార్వతి మెల్టన్, సంజన, విరూపాక్ష స్వామి, శివారెడ్డి, సితార, రమాప్రభ తదితరులు.
రచన: వెలిగొండ శ్రీనివాస్,
సంగీతం: మహతి,
కళ: వి.ఎస్.మణి,
కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్
దర్శకత్వం: జితేంద్ర.వై.
నిర్మాత: జి.విజయ్‌కుమార్ గౌడ్.
విడుదల: శుక్రవారం.


Click it and Unblock the Notifications












