వీడియో: యంగ్ హీరోతో కాజల్ కికి ఛాలెంజ్.. షూటింగ్ స్పాట్‌లో గాయాలు, పోలీసులకు కోపం రాకుండా!
Recommended Video

కికి ఛాలెంజ్ పేరు వింటే యువత ఊగిపోతున్నారు. యువతకు ప్రస్తుతం కికి ఛాలెంజ్ ఫీవర్ పట్టుకుంది. సెలెబ్రిటీలు సైతం కికి ఛాలెంజ్ కు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కికి ఛాలెంజ్ ప్రమాదాలకు కారణం అవుతుండడంతో హైదరాబాద్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రమాదానికి కారణమయ్యే కికి ఛాలెంజ్ చేయవద్దంటూ పోలీసులు సెలెబ్రెటీలకు సూచిస్తున్నారు. హీరోయిన్ రెజీనా కూడా ఈ విషయంలో పోలిసుల ఆగ్రహానికి గురైంది. తాజగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా కికి ఛాలెంజ్ లో భాగమైంది.

బెల్లంకొండతో జంటగా
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటిస్తోంది. డెబ్యూ దర్శకుడు శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బెల్లం కొండ శ్రీనివాస్ మంచి చిత్రాలు చేస్తున్నప్పటికీ మార్కెట్ లేక వసూళ్లు రావడం లేదు.
ఇరగదీశారు
షూటింగ్ స్పాట్ లో ఖాళీ సమయాన్ని కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ సరదాగా గడిపారు. కికి ఛాలెంజ్ కు స్టెప్పులు ఇరగదీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.

పోలీసులకు కోపం రాకుండా
కికి ఛాలెంజ్ పై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ ఎలా చేశారు అనే సందేహం రావచ్చు. పోలీసులకు కోపం రాకుండా మేనేజ్ చేశారు. శ్రీనివాస్, కాజల్ ఓ వీల్ చైర్ లో కూర్చుని ఈ కికి ఛాలెంజ్ కు డాన్స్ చేయడం విశేషం.

రూల్స్ ఫాలో అవుతూ
ఈ వీడియోని కాజల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మిమ్మలి సంతోష పరచడానికే కికి ఛాలెంజ్ లో పాల్గొన్నాం. దానికంటే ముందుగా నిబంధనల్ని కూడా పాటించాలి. అందుకే వీల్ చైర్ లో కికి ఛాలెంజ్ డాన్స్ చేసినట్లు కాజల్ ట్వీట్ చేసింది.

గాయాలతో ఇద్దరూ
బెల్లం కొండ శ్రీనివాస్ కొత్త చిత్రానికి సంబంధించి షూటింగ్ వేగంగా జరుగుతోంది. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో కీలక నటిస్తున్నాడు. యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన సెల్ఫీని శ్రీనివాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సెల్ఫీలో శ్రీనివాస్ తో పాటు నీల్ నితిన్ ముఖేష్, కాజల్ గాయాలతో కనిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











