టాలీవుడ్ స్టార్స్‌పై బెల్లంకొండ సాయి షాకింగ్ కామెంట్స్: అందరూ అనుకున్నట్లు ఫ్యామిలీలా ఉండరంటూ!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్వయంకృషితో వచ్చే వారి కంటే బ్యాగ్రౌండ్‌తో వచ్చే వాళ్లే ఎక్కువ. అయితే, అలా ఎంట్రీ ఇచ్చినా.. టాలెంట్ లేకపోతే పరిశ్రమలో కొనసాగలేరు. ఇలాంటి పరిస్థితుల్లోనూ తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకుని చాలా మంది స్టార్లుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకడు. రిజల్ట్ ఎలా ఉన్నా తనలోని నటుడిని రోజురోజుకూ బయటకు తీస్తూ సక్సెస్ అవుతున్నాడతను. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో టాలీవుడ్ స్టార్లపై బెల్లంకొండ అబ్బాయి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

గ్రాండ్‌గా లాంఛ్.. అవన్నీ నిరాశనే మిగిల్చాయి
బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయి శ్రీనివాస్. 'అల్లుడు శ్రీను'తో హీరోగా ఎంటరైన అతడు.. హిట్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. ఆ తర్వాత ఐదారు సినిమాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్‌ను మాత్రం దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడు చేసిన 'స్పీడున్నోడు', 'కవచం', 'సీత', 'సాక్ష్యం' వంటి చిత్రాలు నిరాశనే మిగిల్చాయి.

ఫలితంతో సంబంధం లేదు.. రిచ్‌గా ఉండాలంతే
జయాపజయాలతో ఏమాత్రం సంబంధంల లేకుండా ప్రతి దాన్ని ఎంతో రిచ్‌గా ప్లాన్ చేసుకుంటాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అతడి మొదటి చిత్రంలోనే స్టార్ హీరోయిన్ సమంతతో జత కట్టడంతో పాటు తమన్నాతో స్పెషల్ సాంగ్ చేయించాడు. ఆ తర్వాత పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, అనుపమా పరమేశ్వర్ వంటి బడా హీరోయిన్లతోనే నటించాడీ యంగ్ హీరో.

అది పర్వాలేదు.. ఇది కెరీర్‌లోనే భారీ విజయం
దాదాపు ఆరేళ్లుగా హీరోగా కొనసాగుతోన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు రెండు చిత్రాలు మాత్రం లాభలను తెచ్చి పెట్టాయి. అందులో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'జయ జానకీ నాయక' ఒకటి. ఇక, రెండోది అతడి గత చిత్రం 'రాక్షసుడు'. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్లనూ రాబట్టింది. అలాగే, నటుడిగానూ పేరు తెచ్చింది.

మరోసారి ‘అల్లుడు’గా రాబోతున్న బెల్లంకొండ
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'అల్లుడు అదుర్స్'. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గొర్రెల సుబ్రమణ్యం నిర్మిస్తోన్న ఈ సినిమాలో నభా నటేష్, అను ఇమాన్యుయల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. అలాగే, రియల్ హీరో సోనూ సూద్ కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఇది విడుదల కానుంది.

ప్రీ రిలీజ్ ఫంక్షన్.. సినిమా రిలీజ్ డేట్ మారింది
సినిమా విడుదలకు సమయం దగ్గర పడడంతో 'అల్లుడు అదుర్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు చిత్ర యూనిట్‌తో పాటు దర్శకులు వీవీ వినాయక్, అనిల్ రావిపూడి తదితరులు గెస్టులుగా విచ్చేశారు. అలాగే, సుమ అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుంది. ఈ ఫంక్షన్‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ను జనవరి 14కు మార్చినట్లు ప్రకటించారు.

టాలీవుడ్ స్టార్స్‌పై బెల్లంకొండ షాకింగ్ కామెంట్స్
ఈ ఈవెంట్‌లో హీరో బెల్లంకొండ సాయి మాట్లాడుతూ.. 'నేను ఇండస్ట్రీలోకి రాకముందు స్టార్స్ అంతా ఒకటే అనుకున్నా. వచ్చాక తెలిసింది వాళ్లంతా ఫ్యామిలీ కాదని. అయితే, ఇప్పుడు అనిల్ రావిపూడి గారు మా సినిమా కోసం రావడంతో నేను అనుకున్నది తప్పు అని రుజువైంది. ఆయన మాకు ఎంతగానో సహకరించారు. చాలా థ్యాంక్స్ సార్' అంటూ వివరించాడీ యంగ్ హీరో.


Click it and Unblock the Notifications











