నెక్స్ట్ టార్గెట్ పవర్ స్టార్.. తేల్చి చెప్పేసిన మెగా మేనల్లుడు..!
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. సాయిధరమ్ తేజ్ నటించిన ఇంటెలిజెంట్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నటన డాన్స్ పరంగా చిరు, పవన్ కళ్యాణ్ జీన్స్ తేజుకు వచింది. ఆ విషయంలో మెగా అభిమానులు సాయిధరమ్ తేజ్ ని చూసుకుని మురిసిపోతారు. మంచి అంచనాల మధ్య ఇంటెలిజెంట్ చిత్రం వస్తుండడంతో తేజు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. వివి వినాయక్ ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దారు. తేజు సరసన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి నటిస్తోంది. తన తదుపరి చిత్రాలనుంచి చిన్న మావయ్య పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తానని ఈ మెగా మేనల్లుడు షాక్ ఇచ్చాడు
Recommended Video


వరుసగా రీమిక్స్ పాటలు
సాయిధరమ్ తేజ్ కెరీర్ ఆరంభం నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ని బాగానే వాడేసుకుంటున్నాడు. తన చిత్రాల్లో పవన్, చిరు మ్యానరిజమ్స్ చేసి చూపించడం, పాటలని రీమిక్స్ చేస్తూ మెగా ఫాన్స్ ని ఖుషి చేసే పనిలో ఉన్నాడు.

తొలి చిత్రంలో ఆ పాట
సాయిధరమ్ తేజ్ నటించిన తొలి చిత్రం రేయ్. వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగా స్టార్ చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ 'గోలీమార్ ' అంటూ సాగే పాటని రీమిక్స్ చేసారు. సినిమా విజయం సాధించకపోవడంతో ఈ పాట పెద్దగా ప్రచారం పొందలేదు.

చిరు, భానుప్రియ..తేజు, రెజీనా
తేజు తన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రంలో చిరు మరోసూపర్ హిట్ పాటని రీమిక్స్ చేసాడు. 80 లలో వచ్చిన మెగాస్టార్ సూపర్ హిట్ చిత్రం ఖైదీ నెం 786 లోనిది ఈ పాట.అప్పట్లో ఈ సాంగ్ యువతని ఉర్రూతలూగించింది.

అందం హిందోళం అంటూ అదరగొట్టేశాడు
సాయిధరమ్ తేజ్ రీమిక్స్ చేసిన మెగాస్టార్ పాటలలో ది బెస్ట్ గా ఈ సాంగ్ ని చెప్పుకోవచ్చు. వరిజినల్ వర్షన్ స్థాయిని పెంచేలా ఈ పాటని సుప్రీం చిత్రంలో రీమిక్స్ చేసారు. తేజు, రాశిఖన్నా నృత్యాలు అభిమానులని తెగ అలరించాయి.

ఇంటెలిజెంట్ లో చమక్కులు
తాజాగా ఇంటెలిజెంట్ చిత్రంలో సాయిధరమ్ తేజ్ చమకు చమకు అనే మెగాస్టార్ పాటని రీమిక్స్ చేయడం విశేషం. వెండి తెరపై ఈ పాటలో తేజుని చూడడానికి మెగా అభిమానులు తెగ ఆరాట పడుతున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్ ప్రోమోలో మెగాస్టార్ మ్యాజిక్ ని తేజు రిపీట్ చేయలేకపోయాడనే టాక్ వినిపిస్తోంది. అసలు విషయం తెలిసియాలంటే సినిమా చూడాల్సిందే.

పవర్ స్టార్ పై కన్నేసాడుగా
ఇంటెలిజెట్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న సాయిధరమ్ తేజ్ రీమిక్స్ పాటల గురించి స్పందించాడు. తన దర్శకుల కోసమే రీమిక్స్ పాటలకు ఒకే చెబుతున్నానాని తేజు అన్నాడు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ పాటలని కూడా రీమిక్స్ చేస్తానంటూ షాకిచ్చాడు.

ఆ రెండు పవన్ పాటలపై గురి
పవన్ కళ్యాణ్ సినిమాల్లోని పాటలని రీమిక్స్ చేయవలసి వస్తే తొలిప్రేమలోని ' ఈ మనసే', జానీ చిత్రంలోని 'నారాజు గాకురా మా అన్నయ' సాంగ్స్ చేయాలని ఉన్నట్లు తేజు తన మనసులో మాట బయట పెట్టాడు.


Click it and Unblock the Notifications











