అభిమానులతో సాయిధరమ్ తేజ్.. పవన్ రాజకీయాల్లో, మనసులో మాట.. ఇకపై జాగ్రత్తగా!
Recommended Video

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ యూ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుస ప్లాప్స్ తో సాయిధరమ్ తేజ్ కెరీర్ పరంగా కాస్త డల్ అయ్యాడు. తేజ్ ఐ లవ్ యూ చిత్రం కోసం సాయిధరమ్ తేజ్ ఎన్నడూ లేనంతగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. చిత్రం విడుదల సందర్భంగా సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియాలో ఫాన్స్ తో లైవ్ చాట్ లో పాల్గొన్నాడు. ఫాన్స్ అడిగిన ప్రశ్నలన్నింటికీ తేజు సమాధానం ఇచ్చాడు.

ఇకపై జాగ్రత్తగా
లైవ్ లోకి వచ్చిన ఫ్యాన్స్ లో ఎక్కువ మంది మంచి కథలు ఎంపిక చేసుకోవాలని తేజుకి సూచించారు. దీనికి తేజు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. తప్పకుండా ఇకపై కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తానని తేజు తెలిపాడు.

రీమేక్ సాంగ్స్
ఇకపై తాను మెగాస్టార్ చిరంజీవి రీమేక్ సాంగ్స్ చేయబోనని తేజు తేల్చాడు. రీమేక్ సాంగ్స్ కు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోందని తెలిపాడు. ముఖ్యంగా తనకే నచ్చడంలేదని తేజు తెలిపాడు. చిరంజీవి చేసిన సాంగ్స్ లో మరొకరిని ఊహించుకోవడం కష్టం అని తేజు అభిప్రాయపడ్డాడు.

పవన్ గురించి మనసులో మాట
పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయాలని తనకూ ఉందని తేజు తెలిపాడు. కానీ ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కదా అని తేజు అభిమానులతో తెలిపాడు. తప్పకుండా తమ మద్దత్తు జనసేన పార్టీకి ఉంటుందని తేజు తెలిపాడు.

చర్చలు జరుగుతున్నాయి
తేజ్ ఐ లవ్ యూ తరువాత తాను చేయబోయే చిత్రం ఇంకా ఖరారు కాలేదని సాయిధరమ్ తేజ్ తెలిపాడు. కథా పరమైన చర్చలు జరుగుతున్నాయని, ఫైనల్ కాగానే ప్రకటన చేస్తామని తేజు తెలిపాడు.


Click it and Unblock the Notifications











