వరుసగా 6 ప్లాపులు.. అయినా షాకిచ్చిన తేజు సినిమా.. చిత్రలహరి ప్రీ రిలీజ్ బిజినెస్!
Recommended Video

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం చిత్రలహరి చిత్రంలో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తేజు కెరీర్ కు చాలా కీలకం. సాయి ధరమ్ తేజ్ నటించిన గత చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. దీనితో తేజు చిత్రలహరిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిస్తున్నాడు. తేజు సరసన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రలహరి చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

వరుస 6 ప్లాపులు
కెరీర్ ఆరంభంలో సాయిధరమ్ తేజ్ దూసుకుపోయాడు. మెగా ఫ్యామిలీ నుంచి మరో స్టార్ అనే అంచనాలు మొదలయ్యాయి. కానీ సుప్రీం చిత్రం తర్వాత ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. సుప్రీం చిత్రం తర్వాత తేజు నటించిన ఏ చిత్రమూ విజయం సాధించలేదు. గత ఏడాది విడుదలైన తేజ్ ఐ లవ్యూ చిత్రం వరకు వరుసగా 6 ప్లాపులు సాయిధరమ్ తేజ్ కు ఎదురయ్యాయి.సాయిధరమ్ తేజ్ మార్కెట్ బాగా దెబ్బతినింది.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో
ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం చిత్రలహరి. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సాయిధరమ్ తేజ్ ప్లాపుల ఎఫెక్ట్ ఈ చిత్రంపై పడుతుందని అంతా భావించారు. చిత్రలహరి ప్రీరిలీజ్ బిజినెస్ 10 కోట్ల లోపే ఉంటుందనే అంచనాలు ట్రేడ్ విశ్లేషకుల్లో వ్యక్తమయ్యాయి. కానీ తాజాగా జరిగిన చిత్రలహరి ప్రీ రిలీజ్ బిజినెస్ షాక్ ఇచ్చే విధంగా ఉంది.

ప్రీ రిలీజ్ బిజినెస్
తాజాగా చిత్రలహరి చిత్రానికి తెలుగు రాష్ట్రాల ప్రీరిలీజ్ బిజినెస్ ముగిసింది. 10 కోట్ల లోపే ఉంటుందని అంచనాలు వస్తున్న తరుణంలో 15 కోట్ల ధర పలకడం విశేషం. సాయిధరమ్ తేజ్ కు ప్రస్తుతం ఉన్న మార్కెట్ దృష్ట్యా ఇది మంచి దారి అని చెప్పొచ్చు. ఓవర్సీస్ హక్కుల దార తెలియాల్సి ఉంది. నేను శైలజ చిత్రంతో కిషోర్ తిరుమల మాయ చేశారు. ఆ తర్వాత కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రం నిరాశపరిచినా ఈ దర్శకుడిపై నమ్మకం అలాగే ఉంది. చిత్రలహరి చిత్రానికి ఉన్నా పాజిటివ్ బజ్ బిజినెస్ విషయంలో కలసి వచ్చిందని అంటున్నారు.

హిట్ కావాలంటే
చిత్రలహరి చిత్రం హిట్ అనిపించుకోవాలంటే 15 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంటుంది. అలా జరగాలంటే తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావాలి. నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వైజాగ్ లో గాయత్రీ దేవి ఫిలిమ్స్, కృష్ణ లో క్రేజీ మూవీ మేకర్స్ ఈ చిత్ర హక్కులని సొంతం చేసుకున్నారు. ఓవర్సీస్ లో సరిగమ సినిమాస్ సంస్థ చిత్రలహరిని విడుదుల చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











