ఫోటోలు: బెజవాడ ఇంద్రకీలాద్రిపై తేజు, అనుపమ.. కనకదుర్గమ్మ దర్శనం!
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ యు చిత్రం జులై 6 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల వేగం పెంచింది. నేడు విజయవాడలో ఆడియో సక్సెస్ మీట్ జరగనుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విజవాడకు వెళ్ళింది.

ఇటీవల జరిగిన ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ఆడియో సక్సెస్ మీట్ విజయవాడలో నిర్వహించనున్నారు. కాగా ఈ ఉదయం సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ తో పాటు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు ఇందరకీలాద్రిపై కనక దుర్గమ్మని దర్శించుకున్నారు.

తేజ్ ఐ లవ్ యూ చిత్రం విజయవంతం కావాలని చిత్ర యూనిట్ పూజలు నిర్వహించింది. ఆలయ అధికారులు దగ్గరుండి తేజు, అనుపమకు దర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నారు.



Click it and Unblock the Notifications











