పవన్ కళ్యాణ్ 'గ్లాసు'కు మరింత గ్లామర్.. సాయిధరమ్ తేజ్ చేతుల్లో పడిందిగా!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తొలిసారి ఎన్నికలని ఎదుర్కొనబోతోంది. పవన్ కళ్యాణ్ జనసేన ఎన్ని సీట్లు సాధిస్తుంది, ఏమేరకు ప్రభావం చూపుతుంది అనే అంశంపై సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్నారు. జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గాజుగ్లాసు గుర్తు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ గాజుగ్లాసు మెగా మేనల్లుసు సాయిధరమ్ తేజ్ సినిమా పోస్టర్ పై కూడా కనిపించడం ఆసక్తిగా మారింది.

 గాజు గ్లాసు

గాజు గ్లాసు

ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తు ప్రకటించినప్పటినుంచి పవన్ అభిమానులు పెద్ద ఎత్తున టీగ్లాసుకు పట్టుకుని సెల్ఫీలు దిగుతూ ప్రచారం కల్పిస్తున్నారు. ఈ గుర్తుని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ బహిరంగ సభలలో మాట్లాడుతూ.. గాజు గ్లాసుని చూపించి ఇదే మన గుర్తు, గబ్బర్ సింగ్ గ్లాసు అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ గాజుగ్లాసులో టీతాగే సన్నివేశాలు ఉన్నాయి.

చిత్రలహరిలో గాజుగ్లాసు

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి చిత్రంలో నటిస్తున్నాడు. మార్చి 24న చిత్రలహరి చిత్రం నుంచి గ్లాస్ మేట్స్ అనే సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో గాజుగ్లాసుని బాగా హైలైట్ చేశారు. కరెక్ట్ టైంకి పాటని రిలీజ్ చేస్తన్నావు అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇది జనసేన గ్లాసు అంటూ మరికొందరు తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. సాంగ్ విడుదలైతే పవన్ కళ్యాణ్ జనసేన గ్లాసుకి సినీ గ్లామర్ కూడా తోడవుతుంది.

 ఇద్దరు హీరోయిన్లతో

ఇద్దరు హీరోయిన్లతో

చిత్రలహరి చిత్రంలో తేజు ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. నివేద పెతురాజ్, కళ్యాణి ప్రియదర్శన్ తేజకు జోడిగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో చిత్రలహరి చిత్రానికి మంచి బజ్ ఏర్పడింది. ఏప్రిల్ 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మైత్రి మూవీస్

మైత్రి మూవీస్

మైత్రి మూవీస్ సంస్థ చిత్రలహరి చిత్రాన్ని నిర్మిస్తోంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న తేజు చిత్రలహరితో గట్టెక్కాలని చూస్తున్నాడు. సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ సుప్రీం తర్వాత నటించిన చిత్రాలన్నీ పరాజయం చెందాయి. దేవిశ్రీ ప్రసాద్ చిత్రలహరికి సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X